ఎపి జట్టుకు కరప విద్యార్థులు ఎంపిక

Apr 20,2024 22:31
మండలంలోని గురజనాపల్లి

ప్రజాశక్తి – కరప

మండలంలోని గురజనాపల్లి పబ్బినిడి పాపారావు జడ్‌పి ఉన్నత పాఠశాల 10వ తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థు నులు ఆంధ్రప్రదేశ్‌ రగ్బీ పోటీలకు ఎంపికయ్యారు. శనివారం పాఠశాల హెచ్‌ ఎం ఎ.సాయిమోహన్‌ మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థునులు జ్యోతిచంద్రిక, సునంద తేజశ్రీ ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరపున ఈ నెల 27 నుంచి 28 వరకూ పూణేలో జరుగు తున్న 67వ స్కూల్‌ గేమ్స్‌ అఖిలభారత రగ్బీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గత నవంబర్‌ 20 నుంచి 22 వరకు జరిగిన 67 రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ రగ్బీ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా జట్టు తరుపున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలిపారని చెప్పారు. శనివారం పూణేకు వెళుతున్న క్రీడాకారిణులను స్టాఫ్‌ సెక్రటరీ ఐ.ప్రసాద రావు, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ పబ్బినీడి వీరబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవాణా ఖర్చుల నిమిత్తవం వారికి హెచ్‌ఎం రూ.1000 అందచేశారు. ఈ కార్యక్రమంలో వివి.రమణమూర్తి, వ్యాయా మ ఉపాధ్యాయులు నాగలిం గేశ్వరరావు, జి.అర్జునరావు పాల్గొన్నారు.

➡️