పటవలలో ఎమ్మెల్యే పొన్నాడ, పితాని ప్రచారం

Apr 5,2024 16:24 #Kakinada

ప్రజాశక్తి-తాళ్లరేవు: పటవల పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ జోరుగా ప్రచారం చేశారు. ముందుగా కొత్తూరు మహాలక్ష్మి ఆలయంలో ఎమ్మేల్యే సతీష్ కుమార్, బాలకృష్ణ పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రపురం, పటవల ఎస్సి పేట, బీసీ పేట, శాంతమూల గ్రామాల్లో ఇంటింటికి, రోడ్ షో ద్వారా ప్రచారం చేశారు. మూడోసారి ఎమ్మెల్యేగా పొన్నాడ సతీష్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పితాని బాలకృష్ణ ప్రజలను కోరారు. రాఘవేంద్రపురం రెండో వీధిలో త్రాగునీటి సమస్య తీర్చాలని మహిళలు ఎమ్మెల్యేను కొరారు. బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే పొన్నాడ, పితాని బాలకృష్ణ జగజ్జీవనరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పినపోతు కామేశ్వరరావు, జడ్పిటిసి దొమ్మేటి సాగర్, స్థానిక ఎంపీటీసీ తణుకు వరలక్ష్మి, సత్తిబాబు, వైకాపా నాయకులు కాదా గోవింద కుమార్,కాలావెంకట రమణ, కొటికలపూడి చందు, కొప్పిశెట్టి వెంకట్, చక్కపల్లి లక్ష్మణ్ , ధూళిపూడి బాబీ, కే. నాగరాజు, యర్రం నీడి అప్పారావు, మోకా మధుబాబు, రేవు మల్లీశ్వరి, రత్నకుమారి,సూర్య కుమారి, పెట్ల సూర్యనారాయణ రాజు, పోతా బత్తుల నూకరాజు, వెంటపల్లి నూకరాజు, శివ, సతీష్, కే. భైరవమూర్తి, పంపన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️