ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ

Apr 14,2024 23:39
ప్రజల జీవన, రక్షణతోపాటు

ప్రజాశక్తి – కాకినాడ

ప్రజల జీవన, రక్షణతోపాటు ప్రజల ఆర్థిక రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తున్న ఘనత అగ్నిమాపక సిబ్బందిదేనని కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న వారందరికీ కలెక్టర్‌ హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు, ఇతర విపత్తుల సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ చేసే కార్యక్రమాలు చాలా సాహసోపేతంగా ఉంటాయన్నారు. ప్రజలకు భద్రత కల్పించడంమే కాకుండా ప్రజల ఆస్తులను కాపాడటం జరుగుతుందని తెలిపారు. అగ్నిమాపక సిబ్బందికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానిని నివారించడం కంటే ప్రమాదం జరగకముందే ఎటువంటి విధి విధానాలు పాటించాలి, ప్రమాదాలు జరగకుండా ప్రజలు తిసుకోవాలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ అధికారి ఎన్‌.సురేందర్‌ ఆనంద్‌ తన సంవత్సరిక నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వి.సుబ్బారావు, పిఠాపురం ఫైర్‌ ఆఫీసర్‌ డి.రామకృష్ణరాజు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

➡️