హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని నిరసన

Jul 1,2024 12:18 #Kakinada

ప్రజాశక్తి-కోటనందూరు : మోడీ ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సోమవారం నాడు సిఐటియు మండల కార్యదర్శి ఎస్కె పద్మ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సు లారీ , ట్రాక్టర్లో డ్రైవర్లు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్కే పద్మ మాట్లాడుతూ న్యాయ సహిత సెక్షన్ 106(2) హిట్ & రన్ చట్టాన్ని రద్దు చేయాలి అన్నారు. ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకులు బాబురావు, రుఫీవుల్లా , శ్రీను మాట్లాడుతూ కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సహిత 2023లోని సెక్షన్ 106 (2) ప్రకారం నిర్లక్ష్యం దురుసు చర్య వ్యక్తి చనిపోయిన సందర్భంలో పోలీసులకు మేజిస్ట్రేట్ తెలియజేయకుండా తప్పించుకుంటే ( హిట్ అండ్ రన్ ) సదురు ముద్దాయికి 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించడానికి డ్రైవర్లు తప్పుపడుతున్నారు.రోడ్డు ప్రమాదాలలో 90 శాతం మానవేతర కారణాలతో జరుగుతున్నాయని అన్నారు. . అనంతరము ఆ స్థానిక తహసిల్దార్ జి విజయ్ కుమార్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కుడుపల్లి బాబురావు , మాస గంగరాజు ఎస్ చిన్న దారకొండ ,నూకరాజు, బి. ప్రసాద్, నాగేశ్వరావు, కుమార్, గూటాల ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

➡️