స్ట్రాంగ్‌ రూమ్‌లను సందర్శించిన ఆర్‌ఒ

May 15,2024 22:24
కాకినాడ సిటీ నియోజకవర్గ

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు బుధవారం ఇవిఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లను సందర్శించారు. జెఎన్‌టియుకె సివిల్‌ బ్లాక్‌ ఆవరణలోని స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీ లించి ఇతర అంశాలపై ఎన్నికల అధికారులతో చర్చించారు. ప్రస్తుత ఎన్నికలలో ఓటర్లు పెద్దఎత్తున ఓటు హక్కు వినియో గించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని ఆర్‌ఒ వెంకటరావు అన్నారు. సిటీలో 72.07 శాతం ఓటు హక్కు వినియోగించుకు న్నారన్నారు. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి సుమారు 6 శాతం ఓటింగ్‌ శాతం పెరిగిందని చెప్పారు. యువకులు, మహి ళలు, వృద్ధులు చైతన్యవంతులై పెద్దఎత్తున తరలివచ్చి ఓట్లు వేశారన్నారు. ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం సహకరించిన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ పర్యటనలో ఎఆర్‌ఒ చల్లన్నదొర పాల్గొన్నారు.

➡️