ఎల్‌ఐసి బ్రాంచ్‌ మేనేజర్‌ పదోన్నతిపై బదిలీ

May 18,2024 17:13
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌

ప్రజాశక్తి – పిఠాపురం

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) పిఠాపురం బ్రాంచ్‌ మేనేజర్‌ ఎన్‌.రాముచౌహన్‌ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను కార్యాలయ సిబ్బంది, డవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, ఏజెంట్స్‌ ఘనంగా సత్కరించారు. డెవలప్మెంట్‌ ఆఫీసర్లు అసోసియేషన్‌ అధ్యక్షులు ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సత్కార సభలో ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కర్నేడి ఏడుకొండలు, రాజమండ్రి డివిజన్‌ కౌన్సిల్‌ ఏజెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రావులు మాధవరావు మాట్లాడుతూ పిఠాపురం ఎల్‌ఐసి బ్రాంచ్‌ ఉన్నతికి, ఏజెంట్స్‌ అభ్యున్నతికి రాము చౌహన్‌ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. బ్రాంచ్‌ మేనేజర్‌ రాము చౌహాన్‌ మాట్లాడుతూ ఏజెంట్స్‌ డవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, ఆఫీస్‌ సిబ్బంది జాతీయస్థాయిలో పిఠాపురం ఎల్‌ఐసి బ్రాంచ్‌ ఉన్నతికి ప్రతి ఒక్కరు సహకారం అందించారన్నారు. అనంతరం రాము చౌహాన్‌ను శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పలువురు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఈనీల్‌ కుమార్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు సుబ్రహ్మణ్యేశ్వర రావు, వర్ధిని, పిఠాపురం బ్రాంచ్‌ ఎల్‌ఐసి ఏజెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు లోకా రెడ్డిరామకృష్ణ, కెవివి.సత్యనారాయణ, కోశాధికారి కొత్త రాంబాబు, బిఎస్‌.ప్రకాష్‌రావు, డవలప్‌మెంట్‌ ఆఫీసర్లు శ్రీనివాస్‌, చాముండేశ్వరి, పావని, శివ, పణి తదితరులు పాల్గొన్నారు.

➡️