వాటర్‌ ట్యాంకులను శుభ్రం చేయించాలి

Jun 18,2024 22:53
నాగులపల్లి రక్షిత మంచినీటి

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

నాగులపల్లి రక్షిత మంచినీటి పథకం( సూరప్ప చెరువు) ద్వారా అందిస్తున్న తాగునీటి వాటర్‌ ట్యాంకులను తక్షణమే శుభ్రం చేయించాలని ఎంపిడిఒ నారాయణరావు ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులు, ఆర్‌డబ్ల్యూఎస్‌, వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్‌ వ్యాధులు ప్రభల్లే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కావున రక్షిత మంచినీటి ట్యాంకులను బ్లీచింగ్‌తో శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్రామాల్లో అపారిశు ద్ధ్యం లేకుండా చూడాలన్నారు. తాగునీటి సరఫరాలో సమయాపాలనను పాటించాలని, లేకపోతే ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఆర్‌డ బ్ల్యూఎస్‌ జెఇ సంధ్య, ఇఒపిఆర్‌డి భాస్కరరావు, మండల విద్యుత్‌ శాఖ అధికారి ప్రమోద్‌, పలు పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️