కరాటే పోటీల్లో ‘దీప్తి’ విద్యార్థుల ప్రతిభ

Mar 19,2024 23:26

జాతీయ స్థాయి పోట్లోల్లో ప్రతిభ చూపిన సాయి దీప్తి విద్యార్థులు

ప్రజాశక్తి -మామిడికుదురు

నందిగామలో ఈ నెల 18న జరిగిన జాతీయ స్థాయి కుంగ్‌ ఫూ, కరాటే ఓపెన్‌ ఛాంపియన్‌ షిప్‌లో నగరం సాయి దీప్తి పాఠశాలకు చెందిన విద్యా ర్థులు ప్రథమ స్థానంలో నిలిచారని ప్రధానో పాధ్యా యురాలు గుబ్బల మౌనిక మంగళవారం చెప్పారు. విద్యార్థులు కొంబత్తుల రోషణ్‌, ఆకుమర్తి నవినాష్‌, మడిమెట్ల అభిషేక్‌, ఉండ్రాజవరపు పూజశ్రీ, జక్కంపూడి నాగ శ్రీకర్‌, బిక్కిన రేష్మా మన్మిత, చింతా కళ్యాణి, శీలం కార్తిక్‌ వెంకట సౌహి, తాడి వర్థబాబు ప్రతిభ చాటారని తెలిపారు. స్థానిక టైగెర్స్‌ కుంగ్‌ ఫూ, కరాటే మాస్టారు మట్టా శ్రీను శిక్షణలో, జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో రాణించిన విద్యార్థులను, వారిని ప్రోత్సాహిస్తున్న సిబ్బం దిని దీప్తి విద్యా సంస్థల అధినేత డివివి.సత్యనారాయణ, ప్రిన్సిపల్‌ జక్కం పూడిశివప్రసాద్‌, పిఇటి బొమ్మిడి ధర్మ అభినందించారు.

 

➡️