చెక్‌ పోస్ట్‌ల వద్ద నిరంతర నిఘా

Mar 27,2024 17:23

సమావేశం లో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా, ఇతర ఉన్నతాధికారులు

ప్రజాశక్తి-అమలాపురం

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటుగా చెక్‌ పోస్ట్‌ ల వద్ద నిరంతర నిఘాను కొనసాగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి 26 జిల్లాల కలెక్టర్లతో ఫారం పెండెన్సీ, సి విజిల్‌ ద్వారా కోడు ఉల్లంఘన పై అందిన ఫిర్యాదుల పరిష్కార సరళి సువిధ ద్వారా అందిన దరఖాస్తు లకు అనుమతులు మంజూరు కంట్రోల్‌ రూమ్‌ పనితీరు, ఎన్నికల సీజర్‌ మేనేజ్మెంట్‌ వ్యవస్థ పనితీరు ఇత్యాది అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫ రెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మద్యం, డబ్బు గుర్తిస్తే తక్షణమే చర్యలు తగు చర్యలు నిబంధనల మేరకు చేపట్టి ఆ యొక్క నివేదికలను సత్వరమే సమర్పించాలని ఆదేశించారు. సాధారణ ఎన్నికల నేపథ్యం లో మద్యం, డబ్బు, విలువైన వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్పో స్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని ఆయన స్పష్టం చేశారు రిటర్నింగ్‌ అధికారులు చెక్పోస్టుల వద్ద కార్యకలాపాలను పరిశీలించి పటిష్ట నిఘాకు అనుస రించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేయా లన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవా లని, ఇంటినుండే ఓటింగ్‌ విధానానికి సంబంధించి 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు నిజంగా నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులను పోలింగ్‌ కేంద్రాల వారిగా ప్రాథమికంగా గుర్తించి నివేదిక సమర్పించాలని ఆదేశిం చారు సి విజిల్‌ యాప్‌ జిల్లా స్థాయి కాల్‌ సెంటర్‌ లలో కోడ్‌ ఉల్లంఘ నలు తదితరాల పై వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు సత్వరమే స్పందించి, సత్వర విచారణ చేపట్టి నాణ్యతతో పరిష్కరించాలని తెలిపారు. పరిష్కారానికి ధి వివరాలను ఫిర్యాదుదారునికి తెలియజేయాల న్నారు.. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రతికూల వార్తల పర్యవేక్ష ణకు ప్రత్యేక బృందాలు పనిచేస్తు న్నాయన్నారు. సీజర్స్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థ, పకడ్బందీగా పని చేసే విధంగా ఆర్వోలు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగు లుగా పని చేస్తున్న ఎవరు కూడా రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనరాదన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయడాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవా లన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో రాజకీయ పార్టీల హెరీర్డింగ్స్‌, పోస్టర్లు, బ్యానర్లు, ఫొటోలు, లోగోలు ఉండడానికి వీలులేదన్నారు. ప్రయివేటు భవనాలపై కూడా గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉండరాదన్నారు. జిల్లాలో కేవలం బ్లూ కలర్‌ రంగు మాత్రమే వేసిన ప్రభుత్వ భవనా లను, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణించరాదని ఆయన స్పష్టం చేశారు రిటర్నింగ్‌ అధికారులు, ఎంసిసి టీమ్స్‌ ఎంసిసి అమలుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సంబంధిత అధికారులు ఎంసిసి అమలుపై ప్రతిరోజూ పరిశీలన చేస్తూ ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా జాయింట్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ఎస్‌.సుధాసాగర్‌, జి.కేశవర్ధన్‌ రెడ్డి, మదన్‌మోహన్‌రావు, డి.ఎల్లారావ్‌, ఎస్‌వివి.సత్యనారాయణ, పార్లమెంట్‌ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎం.ఝాన్సీ రాణి, ఎన్నికల సెక్షన్‌ సూపరింటెండెంట్‌ టి.వైద్యనాథ్‌ శర్మ, ఎఒ సిహెచ్‌.వీరాంజనేయ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️