జీతాలు, అలవెన్సులు చెల్లించాలి

Mar 13,2024 22:58
జీతాలు, అలవెన్సులు చెల్లించాలి

ప్రజాశక్తి-ముమ్మిడివరంసమగ్ర శిక్షలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమ్మె కాలానికి సంబందించి పెండింగ్‌ జీతాలతో పాటు ఇతర అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం కోరింది. బుధవారం సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.వెంకన్న బాబు ఆధ్వర్యాన సమగ్ర శిక్ష కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె కాలానికి జీతాలు విడుదల చేయాలని, ప్రతి నెలా జీతాలు మొదటి తేదీకే ఇవ్వాలని, సిఎఫ్‌ఎంఎస్‌ ద్వారా జీతాలు ఇవ్వాలని, సాధారణ సెలవులతో పాటు మహిళా ఉద్యోగులకు అదనపు సాధారణ సెలవులను మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ ఎజమధుసూదన రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాన్‌ బాబు రత్నం, అనూష, రమాదేవి సుబ్రమణ్యం పాల్గొన్నారు.

➡️