తహశీల్దార్‌ ముక్తేశ్వరరావు సేవలు అభినందనీయం

Feb 6,2024 17:15

ముక్తేశ్వరరావు దంపతులను సన్మానిస్తున్న ఎంఎల్‌ఎ వరప్రసాదరావు

ప్రజాశక్తి- రాజోలు

రాజోలు నుంచి తణుకు బదిలీపై వెళుతున్న తహశీల్దార్‌ బి.మురళీ ముక్తేశ్వరరావు సేవలు అభినందనీయమని రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు.మంగళవారం ముక్తేశ్వరరావుకు వీడ్కోలు సన్మాన కార్యక్రమం రాజోలు సర్పంచ్‌ రేవు జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఎంఎల్‌ఎ రాపాక మాట్లాడుతూ రాజోలు తహశీల్దార్‌ ముక్తేశ్వరరావు నాలుగున్నర ఏళ్ళ పాటు అత్యుత్తమ సేవలు అందించి అందరి ఆదరాభిమానాలు పొందారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, పట్టా పాసుపుస్తకాల జారీ, జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ, 2022 వరదల్లో ఏటిగట్టు పటిష్టం, కరోనా సంక్షోభంలో కూడా మండల ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. తహశీల్దార్‌ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ తమ విధి నిర్వహణలో సహకరించిన వారికి కతజ్ఞతలు తెలిపారు.అనంతరం తహశీల్దార్‌ దంపతులకు పౌర సన్మానం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ మానేపల్లి అయ్యాజీవేమా, ఎఎంసి ఛైర్మన్‌ రోజా రమణి, జెడ్‌పిటిసి సభ్యురాలు మట్టా శైలజా, ఎంపిపి కేతా శ్రీనువాస్‌, కంచర్ల శేఖర్‌, డిటి శ్రీనివాస్‌, తెన్నెటి కిషోర్‌, సర్పంచ్‌, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గ్గొన్నారు.

 

➡️