పాత పెన్షన్‌ సాధన సభకు యుటిఎఫ్‌ నాయకులు

Jan 28,2024 17:10

మాజీ ఎంఎల్‌సి శర్మతో ఆలమూరు యుటిఎఫ్‌ మండల శాఖ నేతలు

ప్రజాశక్తి-ఆలమూరు

రాజమహేంద్రవరంలో జరిగిన పాత పెన్షన్‌ సాధన సభకు ఆలమూరు యుటిఎఫ్‌ మండల శాఖ నాయకులు ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పెన్షన్‌ సాధన లక్ష్యంగా యుటిఎఫ్‌ పనిచేస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఇందులో భాగంగా మాజీ ఎంఎల్‌సి శర్మను కలసి తమ గోడు వెళ్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో వైవివి.రమణ, అద్దరి శ్రీనివాసరావు, జి.భాస్కర్‌రెడ్డి, పివివిజిఎస్‌ఎన్‌.మూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

➡️