ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను పాటించాలి

Apr 18,2024 17:32

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

సాధారణ ఎన్నికలు- 2024 కు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువా రం స్థానిక కలెక్టరేట్లోన మీడియా సర్టిఫికేషన్‌ సమన్వయ కేంద్రం నందు ఆయన పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సాధారణ ఎన్నికలు- 2024 కు సంబంధించి పార్లమెంట్‌ అసెంబ్లీ ఎన్నికలకు గాను గత నెల 16 వ తేదీన విడుద లైన నోటిఫికేషన్‌ నేపథ్యంలో ఈ నెల 18 నుండి నామినేషన్‌ పత్రాలు స్వీకరణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలో అమలా పురం పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్‌ పత్రాలు స్థానిక కలెక్టరేట్‌ నందు స్వీకరిస్తారన్నారు. అదేవి ధంగా ఏడు అసెంబ్లీ నియోజకవ ర్గాలకు సంబంధించి ఆయా రిటర్నిం గ్‌ అధికారుల కార్యాలయాలలో నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్‌ పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు. నామినేషన్‌ స్వీకరణ సంబంధించి ఇప్పటికే భారత ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించిందని ఆ ప్రకారం నామినేషన్‌ స్వీకరిస్తామన్నారు. ఈనెల 26న నామినేషన్‌ పత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుందన్నారు. ఈనెల 29న వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని తదుపరి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిం చడం జరుగుతుందన్నారు. మే 13 వ తేదీ పోలింగ్‌ ప్రక్రియ జిల్లా వ్యా ప్తంగా నిర్వహిస్తారన్నారు. జూన్‌ 4వ తేదీ ఓట్ల లెక్కింపు కాట్రేనికోన మండలం చేయ్యేరు గ్రామ పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్‌ కాలేజీలో నిర్వహిస్తా మన్నారు. జూన్‌ ఆరో తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుం దన్నారు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో సహాయ రిటర్నింగ్‌ అధి కారులుగా సంబంధిత తహశీల్దార్లు వ్యవహరిస్తారన్నారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి జిల్లా కలెక్టర్‌ జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తారని, రామ చంద్రపురం అసెంబ్లీకి ఆర్‌డిఒ ఎస్‌.సుధాసాగర్‌, ముమ్మిడివరం అసెంబ్లీకి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వి.మదన్మోహన్‌రావు, అమలాపురం అసెంబ్లీకి ఆర్‌డిఒ జి.కేశవర్ధన రెడ్డి, రాజోలు అసెంబ్లీకి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌. నుపూర్‌ అజరు, పి.గన్నవరం అసెంబ్లీకి జెడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామచంద్ర మూర్తి, కొత్తపేట అసెంబ్లీకి ఆర్‌డిఒ జివివి.సత్యనారాయణ, మండపేట అసెంబ్లీకి జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ డివిఎస్‌.ఎల్లారావు రిటర్నింగ్‌ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి మూడు వాహనా లతో నిర్దేశత సభ్యులతో మాత్రమే రావాల్సి ఉంటుందన్నారు. ప్రసార మాధ్యమా లలో రాజకీయ ప్రకటన సంబంధించి మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ అను మతులు ముందస్తుగా పొందాల్సి ఉంటుందన్నారు. జిల్లాకు ముగ్గురు వ్యయ పరిశీలకులు వచ్చారని, వీరిలో ఒకరు పార్లమెంట్‌ స్థానానికి మిగిలిన ఇద్ద రూ ఏడు అసెంబ్లీల అభ్యర్థుల ప్రచార ఖర్చులను పర్యవేక్షిస్తారన్నా రు. వెబ్‌ కాస్టింగ్‌ సిసి కెమెరాల చిత్రీకరణ ఆధారంగా నిర్దేశిత రేట్ల ప్రకారం అభ్యర్థులు ప్రచార ఖర్చు లను గణిస్తారన్నారు. షాడో రిజిస్టర్లను నిర్వహిస్తారని తెలిపారు .సహాయ వ్యయ పరిశీలకులు మూడు రోజులకు ఒకసారి నివేది కలను సమర్పిస్తారన్నారు. నామి నేషన్‌ పత్రాలు సక్రమంగా ఉన్నది లేనిది ముందుగా ధ్రువీకరించేందు కు ఆయా రిటర్నింగ్‌ అధికా రుల కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌ ను డిప్యూటీ తహశీల్దార్‌ స్థాయి అధికారి తో ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల ప్రచార ఖర్చు పార్లమెంటుకు రూ.95లక్షలు, అసెంబ్లీకి రూ.40 లక్షలు గా నిర్ధారించారని ఈ పరిధిని మించి ఖర్చు చేసిన ఎడల ఆయా అభ్య ర్థులు పోటీల్లో గెలుపొందినప్పటికీ సభ్యత్వం కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా సద్విని యోగం చేసుకొని ఓటింగ్‌ శాతాన్ని పెంచాలని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎం.ఝాన్సీరాణి, డిఆర్‌ఒ ఎంవెంకటేశ్వర్లు, కోఆర్డినేషన్‌ సూపరింటెండెంట్‌ టి.వైద్యనాథ్‌ శర్మ, డిఐపిఆర్‌ఒ కె.లక్ష్మీనారాయణ, ఎంసి ఎంసి సభ్యులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️