సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్‌ మార్చ్‌

Apr 6,2024 21:42

ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్న కేంద్ర బలగాలు, పోలీసులు

ప్రజాశక్తి-అమలాపురం

అమలాపురం సబ్‌ డివిజన్‌, అమలాపురం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అమలాపురం పట్టణంలో గడియార స్తంభం సెంటర్‌, మునిసిపల్‌ కాలనీ, మార్కెట్‌ వీధి, కుమ్మరి కాలువ గట్టు, గణపతి ధియేటర్‌ రోడ్డు మరియు కలశం సెంటర్‌ మరియు సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్‌ లు, సమస్యాత్మక గ్రామాల్లో స్థానిక పోలీసులు మరియు కేంద్ర బలగాలు సంయుక్తంగా ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎన్నికల విషయమై ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగి ంచుకొనేందుకు ప్రజలకు భరోసా కల్పించి అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. రామచంద్రాపురం డివిజన్‌ లో రామచంద్రాపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ములకలపల్లి గ్రామంలో మరియు సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్‌ లు, సమస్యాత్మక గ్రామాల్లో స్థానిక పోలీసులు మరియు కేంద్ర బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు.

 

➡️