చేతి కర్ర కన్నీరు

Mar 8,2024 16:58 #Konaseema
  • తగ్గిన ఆదరణ 
    వెలవల పోయిన వ్యాపారాలు

ప్రజాశక్తి-రామచంద్రపురం : ఒకప్పుడు ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేసే వెదురు చేతి కర్రలను ప్రస్తుతం ఎవరు కొనకపోవడంతో సాంప్రదాయ వ్యాపారాలు వెలవెల పోతున్నాయి. కోటిపల్లి మహాశివరాత్రి ఉత్సవాలలో విశాఖ ఏజెన్సీ నుంచి తీసుకువచ్చిన చేతి కర్రలను కొనే నాధుడే కరువవడంతో వ్యాపారులు పెదవి విరిచారు. ప్రతి ఆట శివరాత్రి ఉత్సవాలకు అధిక సంఖ్యలో చేతి కర్రల వ్యాపారాలు వచ్చి వందల సంఖ్యలో కర్రలను విక్రయించి వెళ్లేవారు. గత పది ఏళ్లుగా వీటి అమ్మకాలు తగ్గుతూ వచ్చాయని వ్యాపారులు కృష్ణ, జయ, ప్రజాశక్తికి తెలిపారు. గతంలో వ్యవసాయరంగంలో అధికంగా పశువులను ఉపయోగించడం ప్రతి ఇంటి వద్ద ఆవులు, ఎడ్లు, గేదెలు వంటి పశువులను ఎక్కువగా మేపడం రైతులు చేలగట్లకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా చేతి కర్రలను వాడేవారు. ప్రస్తుతం సాంప్రదాయ వ్యవసాయానికి సెలవు ఇవ్వడంతో ఆధునిక యంత్రాలు పరికరాలు వ్యవసాయ పనిముట్లు ఉపయోగించడంతో ఎడ్లను పశువులను వ్యవసాయానికి వాడటం తగ్గించటం, పశువులను మేపడం నెమ్మదిగా తగ్గించి వేయడంతో చేతి కర్రలు అవసరం తగ్గిపోయింది. దీంతో ప్రజలు ఎవరు చేతి కర్రలు కొనడం లేదని వ్యాపారస్తులు తెలిపారు. విశాఖపట్నం నుండి నక్కపల్లి నుండి కడప జిల్లా నుండి డొంకాడ తదితర ప్రాంతాల నుండి ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి తమ కుటుంబాలు విదురికరం సేకరిస్తాయని వాటిలో నల్లకర్రలకు మంచి డిమాండ్ ఉండేదని ప్రస్తుతం కర్రలుకునే నాధుడే లేడని వ్యాపారులు తెలిపారు. ఒక్కొక్క చేతి కర్ర రూ.50 లు నుండి రూ.120 లు వరకు విక్రయిస్తామని వారు తెలిపారు. ప్రతి పండగల్లోనూ, ఉత్సవాలను వెదురు చేతి కర్రలు విక్రయిస్తామని, ఈసారి రవాణా ఖర్చులు కూడా వస్తాయో రావాలని వెదురు కర్రల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️