ఘనంగా కార్మిక దినోత్సవం

May 1,2024 23:37

మండపేటలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు, పాల్గొన్న కె.కృష్ణవేణి తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగం

జిల్లాలో బుధవారం మేడే (కార్మిక దినోత్సవాన్ని ) ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన మేడే వేడుకల్లో సిఐటియు, యుటిఎఫ్‌, అంగన్‌వాడీ కార్యర్తలు, ఆశాలు, మిడేమీల్‌ కార్మికులు, తదితర యూనియన్లు పాల్గొన్నారు. ప్రజాసంఘాల నాయకులు, వివిధ యూనియన్ల నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. మండపేట : సమస్యల పరిష్కారానికి పోరాటలే శరణ్యమని సిఐటియు జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి అన్నారు. కార్మిక దినోత్సవాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా మేడే జెండాను సిఐటియు ఆమె కార్మిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ చికాగో నగరంలో ఆరోజు మిడిల్‌ లో పనిచేస్తున్న కార్మికులందరూ పని గంటల తగ్గించాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, మహిళలు పోరాటంలోకి రావడం వారిపై కాల్పులు జరపడం అనేక మంది కార్మికులు చనిపోయారన్నారు. మనం మే 1న కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. అయితే ఈరోజు కార్మికులు కట్టు బానిసలుగా చేసేటట్టుగా చట్టాలు తీసుకొచ్చి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్లకు దోసి పెడుతున్నారని, యాజమాన్యాలు కనుకూలంగా కార్మిక చట్టాలు మార్చడం, అలాగే భవనిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రద్దు, పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పులపాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ సమస్యలపై సిఐటియు మేడే స్ఫూర్త్తితో మరిన్ని పోరాటాలు చేస్తుందని కార్మిక వర్గం తమ సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి.కొండ, కె.నరేంద్ర, సిహెచ్‌.రాణి, ఎం.సూరి కుమారి, కె.కుసుమ, ఎ.వజ్రం, దేవకి, సుశీల, కె. విజరు లోవరాజు, లలిత మరియు ద్వారపూడి రైల్వే జట్టు కార్మికులు పాల్గొన్నారు. రాయవరం మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. అంగన్‌వాడీ సీనియర్‌ నాయకులు ఎస్‌.కృష్ణకుమారి మేడే జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు మండల కన్వీనర్‌ డి.ఆదిలక్ష్మి మేడే ప్రాముఖ్యతను వివరించారు. నూతనంగా ఏర్పడిన ఎలక్ట్రిషియన్స్‌, ప్లంబర్స్‌ వర్కర్స్‌ అసోషియేషన్‌ యూనియన్‌ సభ్యులతో పాటు అంగన్‌వాడీ, ఆశా, మిడ్‌ డే మీల్స్‌ సంఘాల ప్రతినిధులు కమల, నూకరత్నం, తులసీ, దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు: తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట మేడే దినోత్సవం పురస్కరించుకుని సిఐటియు, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆయా జెండాలను సీనియర్‌ నాయకులు ఆవిష్కరించారు. అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేపట్టి మన హక్కులు సాధించుకుందామన్నారు. కార్యక్రమంలో పెన్షనర్స్‌ మండల కార్యదర్శి కెవిఆర్‌.బాపూజీ, యుటిఎఫ్‌ నాయకులు అద్దరి శ్రీనివాసరావు, వైవివి.రమణ, పివివిజి ఎస్‌ఎన్‌.మూర్తి, జె.మనోజ్‌, భాస్కర్‌ రెడ్డి, ఈదర రమేష్‌, నాగేశ్వరరావు, శ్యామల, అంగన్‌వాడీల నాయకులు యు.సుశీల, ధనలక్ష్మి, వెంకటలక్ష్మి, మెర్సి ప్లోరెన్స్‌, ఎస్‌టియు నాయకులు, మిడ్డే మీల్స్‌, ఆశా కార్యకర్తలు, వివిధ ఆటో సంఘాల యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. రామచంద్రపురం: మే డే దినోత్సవం సందర్భంగా ఎర్రజెండాను సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా నాయ కులు వి.భీమ శంకరం కార్మికుల మధ్యలో ఎగరవేశారు. పిడిఎస్‌యు నాయకులు బి.సిద్ధు, ఐఎఫ్‌ టి యు నాయకులు చింతా రాజారెడ్డి ప్రసంగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం తమ హక్కుల రక్షణ కోసం దోపిడీ ప్రభుత్వాలు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో రాజీలేని పోరాటాలను చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబటి కృష్ణ, కంటే సత్య నారాయణ, పోలిశెట్టి శ్రీనివాస్‌, రైతు కూలీ సంఘం నాయకులు రావి భాను, కె.పనస రామయ్య, ఆటో యూనియన్‌ ప్రెసిడెంట్‌ బి. సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం: మండలంలోని పలు గ్రామాల్లో మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. అంగర, పడమర ఖండ్రిక, కపిలేశ్వరపురం తదితర గ్రామాల్లో యుటిఎఫ్‌, సిఐటియూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేడే పతాకాన్ని ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. మేడే స్పూర్తి తో సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని కార్మికులకు పిలపునిచ్చారు. కార్యక్రమంలో అంగనవాడి ప్రాజెక్ట్‌ లీడర్‌ మేడిశెట్టి బేబీ, మండలలీడర్‌ ఎం.జానకి దేవి, యుటిఎఫ్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి డివి.రాఘవులు, జిల్లా సహా అధ్యక్షులు పి.సురేంద్ర కుమార్‌, మండల అధ్యక్షులు బి వెంకటేశ్వరరావు, కార్మిక సంఘాలు, ఉపాధ్యా యులు, వడ్రంగి, తాపీమేస్రి, ఆటో యూనియన్‌ సభ్యులు, అంగన్‌వాడీలు, ఆశ కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు. రాజోలు: మేడే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని కౌలు రైతు సంఘం నాయుకులు పీతల రామ చంద్రరావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో రాజోలు సాయిబాబా సెంటర్‌ లో మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు బుంగ సత్యనారాయణ, ఐద్వా నాయుకురాలు అన్నపూర్ణ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాట్రేనికోన: మండల వ్యాప్తంగా మేడే వేడుకలను సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు విప్పర్తి మోహన్‌ రావు, విత్తనాల రాంబాబులు మాట్లాడుతూ మేడే స్ఫూర్తిని ప్రతి కార్మికుడు ఆదర్శంగా తీసుకొని కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పల్లంకూరు, కందికుప్ప, గొంతుకూరు, కాట్రేనికోన గ్రామాల్లో మేడే జెండాలను ఆవిష్కరించారు. వేడుకల్లో భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, కొబ్బరి ఒలుపు దింపు కార్మికులు, స్కూల్‌ ఆయాలు సంఘాలకు చెందిన మహేశ్వరి, వెంకటలక్ష్మి, గుత్తుల కనకదుర్గ, ఎం.వెంకటలక్ష్మి, గంజా సత్తిబాబు, కృష్ణ, నాగు, బొంతు పార్వతి, గోడ దుర్గ, శైలజ తదితర కార్మికులు పాల్గొన్నారు. ముమ్మిడివరం: నగర పంచాయతీ పరిధిలోని స్థానిక బళ్లగేటు సెంటర్‌ లోని సిఐటియు కార్యాలయంలో బుధవారం మే డే వేడుకలు నిర్వహించారు. సిఐటియు మండల అధ్యక్షుడు నిమ్మ కాయల వెంకటేష్‌ సిఐటియు జెండాను ఎగురవేయగా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు దొమ్మెటి వీర రాఘవులు వ్యవసాయ కార్మిక సంఘం జెండా ను ఆవిష్కరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ మాట్లాడుతూ పోరాడితే పోయేదేమీ లేదు భానిస సంకెళ్లు తప్ప అనే నినాదం స్ఫూర్తితో భూర్జువా పాలక పక్షాలపై పోరాటాలకు సన్నద్ధం కావాలని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాము బాలయ్య, మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ అద్వర్యంలోని మిత్రపక్షాల కూటమి అయిన ఇండియా కూటమిని గెలిపించాలని కార్మికులకు సూచించారు. ఈ వేడుకల్లో దొమ్మేటి వీర రాఘవులు లక్ష్మణ రావు సత్యనారాయణ, జట్టు కార్మిక సంఘం, దింపు కార్మిక సంఘం, ఒలుపు కార్మిక సంఘం, అంగన్‌ వాడీ కార్యకర్తలు గాలి మంగాయమ్మ, టి.శ్రీదేవి, సత్యవతి, మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే నగర పంచాయతీ కాంట్రాక్టు అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం అద్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద సంఘం అధ్యక్షుడు పెట్టా శివ ప్రసాద్‌ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలోఎం. శ్రీనివాస రావు, ఎస్‌.అజరు కుమార్‌, ఎన్‌.అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మామిడికుదురు : మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు సినిమా హాల్‌ సెంటర్‌ లో వినాయక పెయింటర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనిశెట్టి పండు పతాకాన్ని ఆవిష్కరించారు. అమలాపురం రూరల్‌: అమలాపురం ఆటో వర్కర్స్‌ యూనియన్‌, ఉపాధి హామీ పథకం కార్మికులు యూనియన్‌ ఆధ్వర్యంలో అమలాపురంలో మేడే జెండా ఆవిష్కరణలు ఘనంగా జరిగాయి. వర్కర్స్‌ యూనియన్‌, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ముత్తాబత్తుల నాగమణి, కె.వి.రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో ఆటో యూనియన్‌ కార్మికులు ప్రెసిడెంట్‌ పండు నాగరాజ్‌, సెక్రెటరీ మున్నా, పి నాగరాజు, పాములు వెంకటేశ్వరరావు,బి రుద్ర,కే అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట : ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ స్వర్ణోత్సవ స్తూపం వద్ద కార్మిక దినోత్సవం సందర్బంగా అరుణ పతాకాన్ని యుటిఎఫ్‌ పెన్షనర్స్‌ వింగ్‌ కార్యదర్శి కెవి.రమణ, పూర్వ అధ్యక్షులు ఎమ్‌వివి.సత్యనారాయణ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి వై.మురళి, ప్రధాన కార్యదర్శి జి.రామ్‌ కుమార్‌, సహధ్యక్షులు పి.భాస్కర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

 

➡️