రాజ్యాంగ రక్షణకై ‘ఇండియా’ని గెలిపించండి

Apr 4,2024 13:11 #Konaseema

రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్

ప్రజాశక్తి-రామచంద్రపురం : భారతదేశంలో మతోన్మాద బీజేపీ చర్యల వల్ల రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలగబోతున్నదని అందుకోసం మతోన్మాద మతతత్వ పార్టీలను ఓడించి రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో నిర్వహిస్తున్న ఎన్నికల పాటల వర్క్ షాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించి అత్యంత విలువలతో కూడిన ప్రపంచం మెచ్చుకునే రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందిస్తే ఆ రాజ్యాంగాన్ని నిలువునా తుంగలో తొక్కి మనువాద సిద్ధాంతమైనా మనుస్మృతి నే రాజ్యాంగంగా మార్చడానికి అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ తో జతకట్టి మనువాదాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని మానవ వాదాన్ని సమాజంలో లేకుండా చేస్తుందనే భయాందోళన ప్రజల్లో కలుగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ అతని అనుచరులైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు అందరూ బిజెపికి వత్తాసు పలుకుతూ రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నారని, భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఇండియా అభ్యర్థుల గెలుపు కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి సాంస్కృతిక విభాగం ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించాలని సాంస్కృతిక రంగం పాట , ఆట, లేకుండా ఏ ఉద్యమం విజయవంతం కాలేదన్న విషయాన్ని కళాకారులు గుర్తించాలని ఆ దిశగా కళాకారులు తమ వంతు కర్తవ్యం గా ఈ ఎన్నికల రణరంగంలో ప్రజానాట్యమండలి ప్రముఖ పాత్ర పోషిస్తూ ఆటపాటలతో కొత్త కళారూపాలతో ప్రజల్ని మరింత చైతన్యవంతం దిశగా మరల్చి ఓట్లను రాబట్టడానికి అవసరమైన నూతన కళారూపాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిందిగా ఆయన సూచించారు. ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు డాక్టర్ స్టాలిన్ మాట్లాడుతూ పార్టీని ప్రజాసంఘాలను ప్రజా చైతన్యం వైపు మరల్చడానికి ప్రజానాట్యమండలి ఎంతగానో దోహదపడుతున్నదని ప్రజానాట్యమండలి గళాన్ని వినిపిస్తూ దళాలుగా ఏర్పడి రాష్ట్రమంతా విస్తృతంగా ప్రచార ప్రయత్నం చేస్తున్నందుకు కళాకారులందరికి అభినందనలు తెలిపారు. పాటను నమ్మి పాడాలి పాటలో భావన మన జీవన తాత్వికతను ప్రజలకు తెలిసేలా ఉండాలి పాటతో ఉత్సాహం నిబద్ధత ప్రేరణ కలిగించి ప్రజల్ని మంచి మార్గాన్నే నడిపేదే కమ్యూనిజం నేడు ఆర్థిక పోరాటాలు రాజకీయ పోరాటాలు ఎలా నిత్యం ప్రజల్లో ఉంటున్నాయో అలాగే సాంస్కృతిక పోరాటాలు కూడా నిత్యం కొనసాగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి ఈ ఎన్నికల పాటల శిక్షణా శిబిరం ఏర్పాటు చేసుకోవడం తమకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఇఫ్టు జాతీయ కార్యదర్శి గని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య రాష్ట్ర అధ్యక్షులు పి చంద్ర నాయక్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రాము, ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్చార్జి మహంత లక్ష్మణరావు, వి నాగరాజు, శివయ్య , నజీర్ , కుమార్, శామ్యూల్, ప్రేమానందం, అనంతలక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు.

➡️