పవన్‌ కల్యాణ్‌తో కొత్తపల్లి సుబ్బారాయుడు భేటీ

ప్రజాశక్తి- నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : నరసాపురం నియోజకవర్గంలో జనసేన విజయానికి ముందుండి పార్టీ శ్రేణులను నడిపించాలని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కోరారు. మంగళవారం రాత్రి పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌తో సుబ్బారాయుడు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నరసాపురం నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ విజయానికి సుబ్బారాయుడు అండగా ఉండాలని ఆయన రాజకీయ అనుభవానికి, పెద్దరికానికి పార్టీ విలువ ఇస్తుందని పవన్‌ అన్నారు. భవిష్యత్తులో తగిన రీతిలో గౌరవిస్తామని ఆ బాధ్యతను తాను తీసుకుంటామని అన్నారు. ఇటీవల జనసేనలో చేరిన కొత్తపల్లి సీటు ఆశించారు. నరసాపురం జనసేన సీటును బమ్మిడి నాయకర్‌ కు కేటాయించారు. సీటు రాకపోవడంతో ఇటీవల కొత్తపల్లి ప్రెస్‌ మీట్‌ లో తాను పోటీలో ఉంటానన్నారు. దీంతో కొత్తపల్లితో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు.

➡️