నారా లోకేష్‌ సమక్షంలో టిడిపిలో చేరిన కొత్తపల్లి సూరి రెడ్డి

Mar 21,2024 14:32 #Chittoor District, #joined TDP

ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : వైసిపి నాయకుడు కొత్తపల్లి మిట్టకు చెందిన వెంకటేష్‌ రెడ్డి అలియాస్‌ సూరి రెడ్డి, పుల్లూరు గ్రామానికి చెందిన పుల్లూరు మాజీ ఎంపిటిసి గుర్రప్ప, మాజీ ఎంపిటిసి గిరి వైసిపి మండల కమిటీ లీడర్‌ రమేష్‌ గురువారం రేణిగుంట విమానాశ్రయం వద్ద టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో దాదాపు 100 మందితో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సూరి రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి తన స్థాయి శక్తుల కృషి చేస్తానన్నారు. పార్టీలోకి సాధరంగా ఆహ్వానించిన లోకేష్‌కి, గంగాధర నెల్లూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి డాక్టర్‌ థామస్‌కు, స్థానిక నాయకులకు పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు ఎస్‌ఆర్‌పురం మండల పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయశంకర్‌ నాయుడు, రాజశేఖర్‌ నాయుడు భాస్కర్‌ నాయుడు, గురునాథం, యోగేశ్వర్‌ నాయుడు, సిద్ధయ్య శెట్టి, చంద్రబాబు రెడ్డి, బాలాజీ నాయుడు, మహేష్‌, బ్రహ్మనాయుడు బసవిరెడ్డి పల్లి మోహన మురళి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️