కృష్ణా విశ్వవిద్యాలయంను సందర్శించిన జిల్లా కలెక్టర్

Dec 30,2023 17:25 #Krishna district
కృష్ణా విశ్వవిద్యాలయంను సందర్శించిన జిల్లా కలెక్టర్

రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ..

ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్  : రానున్న సాధారణ ఎన్నికల నిర్వహణకు వీలుగా ఓట్ల లెక్కింపు గదులను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి మచిలీపట్నం లోని కృష్ణా విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అకాడమిక్ బ్లాకును సందర్శించారు.రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు,మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కార్యక్రమం విశ్వవిద్యాలయంలో జరగనుందన్నారు. ఇందుకోసం అవసరమైన ఓట్ల లెక్కింపు హాళ్లను, స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించి ఎంపిక చేశారు. అక్కడక్కడా సీలింగ్ తదితర మరమ్మతులు వెంటనే చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సిబ్బంది, రాజకీయ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు రాకపోకలకు వీలుగా కౌంటింగ్ హాలు విశాలంగా ఉండాలని సూచించారు. ఓట్లు లెక్కింపు కోసం వచ్చే వారి వాహనాలను నిలిపేందు కోసం అవసరమైన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంట విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జి జ్ఞానమణి, డిఆర్ఓ పెద్దిరోజా, మచిలీపట్నం ఆర్డిఓ ఎం వాణి, డిపిఓ నాగేశ్వర్ నాయక్, ఆర్ అండ్ బి ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, తహసిల్దార్ శ్రీవిద్య, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సమన్వయ అధికారి సురేష్, డిటి శ్యామ్, మండల సర్వేయర్ రాజబాబు, వీఆర్వోలు, విశ్వవిద్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️