జిల్లా టాపర్‌ భానుప్రసన్నకు సత్కారం

Apr 24,2024 23:32

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

పదో తరగతి ఫలితాలలో కృష్ణాజిల్లాలో 590 మార్కుల సాధించిన గుడివాడ ఏకేటిపి ఎంజిహెచ్‌ హైస్కూల్‌ విద్యార్థి అల్లంపల్లి భానుప్రసన్న కష్ణాజిల్లా టాపర్‌ గా ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ విద్యార్థిని బుధవారం మచిలీపట్నంలోని డీఈఓ ఛాంబర్‌ లో కష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి తాహెరా సుల్తానా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ విద్యార్థికి ఉన్నత చదువుకి అవసరమైన సహాయాన్ని, సహకారాన్ని అందిస్తానని తెలియజేశారు.అలాగే దావా వెంకట నాగేంద్ర ప్రసాద్‌ హైదరాబాద్‌ సహకారంతో విద్యార్థినికి పది వేల రూపాయలు పారితోషకమును అందించారు. విద్యార్థి తండ్రి అల్లంపల్లి రాంబాబు రోజువారి తాపీ పనులు చేసుకుంటూ, జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.ఉమామహేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు దుర్గా ప్రసన్న, హుమేమా సుల్తానా, ఘంటసాల మండల విద్యాశాఖ అధికారి మోమిన్‌, ఆప్‌ కాస్ట్‌ డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️