కొండాలమ్మ సన్నిధిలో దేవదాయ కమిషనర్‌

Apr 10,2024 22:38

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు

మండలంలోని వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారిని దేవాలయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ బుధవారం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనక ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఆలయ కార్యనిర్వహణ అధికారి కానూరి సురేష్‌బాబు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేష వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. అనంతరం కమిషనర్‌ దేవస్థానం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం తనిఖీ అధికారి కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️