గార్లదిన్నెలో విద్యార్థుల వినూత్న నిరసన

Jan 6,2024 20:01

కుక్కకు వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు

– ఉపాధ్యాయులను నియమించాలని కుక్కలకు వినతి
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు

మండలంలోని గార్లదిన్నె గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ శనివారం మండలంలోని గార్లదిన్నెలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కుక్కలకు వినతిపత్రం అందజేశారు. గార్లదిన్నె ప్రభుత్వ పాటశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. అనేకసార్లు జిల్లా, మండల విద్యాధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. కుక్కలకు వినతిపత్రం ఇచ్చామని గ్రామస్థులు, విద్యార్థులు తెలిపారు. కేవలం ఒక్క ఉపాధ్యాయుని డిప్యూటేషన్‌ కింద వేశారు. ఆ ఉపాధ్యాయుడు ఏ తరగతి విద్యార్థులకు క్లాసులు బోధించాలి, ఎవరికి చెప్పకూడదో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

➡️