రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆర్డిప్‌ సంస్థల ఆధ్వర్యంలో పశువుల దాణా పంపిణీ

Dec 18,2023 19:47

రైతులకు దాణా అందజేస్తున్న అధికారులు

ప్రజాశక్తి – నందవరం
మండలంలోని నాగలదిన్నె, చిన్నకొత్తిలి, పెద్దకొత్తిలి గ్రామాల్లో రిలయన్స్‌ ఫౌండేషన్‌, ఆర్డిప్‌ సంస్థల ఆధ్వర్యంలో సోమవారం పశువుల దాణా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్‌ నరేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడారు. భారతదేశం వ్యవసాయంతో పాటు పశు పోషణలో కూడా అభివృద్ధి సాధించాలని తెలిపారు. జీవనోపాధులు పెంచుకోవాలని కోరారు. ప్రస్తుతం బర్రెలకు, మేకలకు, ఆవులకు రోగ నిరోధక శక్తి తగ్గి, పాల ఉత్పత్తి తగ్గుతోందని, సీజనల్‌ వ్యాధులు వస్తాయని చెప్పారు. పశు యజమానులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరిస్థితిలను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్‌ ఫౌండేషన్‌, ఆర్డిప్‌ సంస్థ అవగాహన, శిక్షణలు ఏర్పాటు చేసి మెళకువలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. రోగ నిరోధక శక్తి, పాల ఉత్పత్తిని పెంచాలని ఉచితంగా దాణా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఆర్డిప్‌ సంస్థ ఎక్స్‌టేషన్‌ వర్కర్‌ ఉస్సేని మాట్లాడుతూ… రైతులకు పోషక విలువలతో కూడిన దాణా ఉచితంగా అందించినట్లు తెలిపారు. ఏమైనా సమస్యలుంటే టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004198800కు సంప్రదించాలని కోరారు. సర్పంచి బోయ లక్ష్మి తిమ్మప్ప, హారతి, చంద్రశేఖర్‌, ఎపిసిఎన్‌ఎఫ్‌ శ్రీనివాసులు, పెద్ద రామాంజనేయులు, బ్రహ్మయ్య పాల్గొన్నారు.

➡️