వైసిపి నుంచి టిడిపిలో చేరిక

Jan 6,2024 20:00

పార్టీలోకి ఆహ్వానిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

– ఎర్రకోట నుంచి పార్టీలో చేరిన యువకులు
– హాలహార్వి నుంచి 50 మంది చేరిక
ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
నియోజకవర్గంలో వైసిపి నుంచి టిడిపిలోకి పలువురు చేశారు. శనివారం మండలంలోని ఎర్రకోట గ్రామానికి చెందిన ఈడిగ నరసింహులు, శ్రీరాములు, శ్రీనివాసులు, బాలు, రాజు, హరికృష్ణ, శివ, రవి, నరసింహులు, బాలుతో మరో 50 మంది మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారికి బీవీ కండువా వేసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి స్వగ్రామం ఎర్రకోట నుంచి టిడిపిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని కాదని ఎర్రకోట గ్రామస్తులు వేరే రాజకీయ పార్టీలోకి వెళ్లలేదు. ప్రస్తుతం ఎర్రకోట నుంచి టిడిపిలో చేరడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. అలాగే నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన మస్లింలు ఖాజా, బకాష్‌, రసూల్‌, డాక్టర్‌ బాషా, పెద్దమాబు, బడేసాబ్‌, చిన్న మాబు, చాంద్‌ బాషా, మునాఫ్‌, ఖాసీమ్‌, వలీ, గని, గౌస్‌, జబ్బార్‌, మహ్మద్‌తో పాటు చాకలి నరసప్ప, హరికృష్ణ మరో 50 మంది టిడిపిలో చేరారు. మాజీ ఎమ్మెల్యే బీవీ.జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో రైస్‌ మిల్‌ నారాయణ రెడ్డి అధ్వర్యంలో చేరారు.

➡️