కోడుమూరులో రిలే నిరాహార దీక్షలు

Jan 5,2024 17:32 #Kurnool
anganwadi workers strike 25th day krl

ప్రజాశక్తి-కోడుమూరు మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు వారు చేస్తున్నటువంటి సమ్మె 25వ రోజు చేరిన సందర్భంగా రోజువారీగా రిలే నిరాహారులు దీక్షలు చేస్తామని నాయకులు అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా చేసిన ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లనియకుండా ఎక్కడికక్కడే అరెస్టులు చేసి అంగన్వాడీల హక్కులను కాలరాశారు. ఈ సందర్భంగా శాంతియుతంగా కూడా చేయనియ్యని ఈ ప్రభుత్వంపై రాబోయే రోజుల్లో ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తామని తెలుపుతూ రిలే నిరాహార దీక్షలను చేయడం జరిగింది. కోడుమూరులో రిలే దీక్షలో అంగన్వాడి నాయకురాళ్లు అరుణ హైమావతి మరియు గీత హేమలత దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి వీరన్న మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేయాలని కమిటీ నిర్ణయించింది. పై నిర్ణయం ప్రకారం కోడుమూరులో కూడా ప్రారంభించడం జరిగింది. ఈ రిలే దీక్షలు రాబోయే రోజుల్లో ఆమరణ దీక్షకైనా వెనకాడేది లేదని వారన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయభారతి, సూలమ్మ ఫాతిమా, రజియా, భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️