అంగన్వాడీల విజయోత్సవ ర్యాలీ

Jan 24,2024 17:04 #Kurnool
anganwadi workers winning celebrations devanakonda

అంగన్వాడీల సమ్మె భవిష్యత్తు కార్మిక ఉద్యమాలకు దిక్సూచి
బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్న కార్మిక సంఘాల నేతలు
ప్రజాశక్తి-దేవనకొండ : తమ హక్కుల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో చేపట్టిన 42 రోజుల వీరోచత పోరాటం ద్వారా అంగన్వాడీలు చేసిన సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించడంతో సమ్మె విరమించిన అంగన్వాడీలు బుధవారం దేవనకొండలో సిఐటియు, ఏఐటియూసి యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక బస్టాండ్ కూడలి ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, భారీ ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.వీరశేఖర్, మద్దిలేటి శెట్టి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా లీడర్లు శ్రీదేవి, జ్యోతి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42 రోజుల పాటు సమ్మెకు సహకరించిన అధికారులకు, పాత్రికేయులకు, వామపక్షాలకు, గర్భిణులు, బాలింతలు, ప్రజలకు విప్లవాభివందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘ నాయకులు విజయలక్ష్మి, మాబున్ని, సజీవమ్మ, నరసారావు, యూసుఫ్, అశోక్, బడేసాహెబ్, మహబూబ్ భాష, బజారి, మహబూబ్, రవి,రాయుడు, లక్ష్మణస్వామి, శ్రీరంగడు తదితరులు పాల్గొన్నారు.

➡️