యర్రగుంట్లలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైసిపి నేతలు

Mar 28,2024 12:15 #bhuma akila priya, #Kurnool, #TDP
  •  రైతుల సమస్యలపై సిఎం జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిలప్రియ.. 

ప్రజాశక్తి-నంద్యాల : టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైసిపి నేతలు, పోలీసులు అడ్డుకున్నారు.  మేమంతా సిద్ధం పేరుతో జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు.  దీనిలో భాగంగా ఆళ్లగడ్డలో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. అన్నదాతల సమస్యలపై సీఎంకు వినతిపత్రం అందించేందుకు భూమా అఖిలప్రియ అక్కడికి బయల్దేరారు. టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో అఖిలప్రియను వైసిపి నేతలు, పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు అక్కడి ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. రైతుల సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు వచ్చానని.. అపాయిట్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తే సీఎంవో స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చానన్నారు. వినతిపత్రం ఇస్తే శాంతిభద్రతల సమస్య ఎలా అవుతోందని ప్రశ్నించారు.

➡️