చెన్నై జట్ల విజయం

Jan 13,2024 23:51

ప్రజాశక్తి – మేదరమెట్ల
ఆర్ఎస్ సిఎ ఆధ్వర్యంలో రావినూతలలో జరుగుతున్న శ్రీ భ్రమరా సంక్రాంతి క్రికెట్ కప్ పోటీల్లో శనివారం శ్రీ సిసి చెన్నై, జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్లు విజయాలు సాధించాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో శ్రీ సీసీ చెన్నై, వైట్ ఫీల్డ్ క్రికెట్ అకాడమీ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటిగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 19.2ఓవర్లలో 115 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. జట్టులో వెంకటేష్ ఒక్కడే 38బంతులకు 53 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన శ్రీసీసీ చెన్నై జట్టు 13.4 ఓవర్లలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 117పరుగులు చేసి ఎనిమిది వికెట్ల విజయం సాధించింది. తరుణ్ 51, అభి 44 పరుగులు చేశారు. మెన్ ఆఫ్ ది మ్యాచ్‌గా తరుణ్ ఎంపిక అయ్యాడు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌వైసిసి హైదరాబాద్, జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్లు తలపడగా హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 130పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు 15.3 ఓవర్లలో 3వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేశారు. దీంతో ఏడు వికెట్ల విజయం సాధించింది. చెన్నై జట్టులో సుదీప్ 50పరుగు చేసి అర్థ సెంచరీ నమోదు చేశాడు. మాన్ ఆఫ్ ది మాచ్‌గా ఎంపికయ్యారు. ఈ మ్యాచ్‌లను నిరంతరం ఆర్ఎస్ సిఏ అధ్యక్షులు కారుసాల నాగేశ్వరరావు, కారుసాల ప్రదీప్, రామినేని శ్రీనివాసరావు, నరసింహారావులతో పాటు అసోసియేషన్ సభ్యులు పర్యవేక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో మ్యాచ్‌లు జరిగే విధంగా నిర్ణయాలు .తీసుకుంటున్నారు. నేటి మ్యాచ్లు. ఉదయం థండర్ బోర్డ్స్ తిరుపతి వర్సెస్ శ్రీసీసీ చెన్నై, మధ్యాహ్నం ప్రసాద్ ఫోర్స్ 11 హైదరాబాద్ వర్సెస్ జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్లు తలపడనున్నాయి.

➡️