రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేర్చాలి 

Jan 8,2024 16:16 #Kurnool
spdl workers protest

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : ఏపీ ఎస్పీడీసీఎల్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు వర్కర్స్ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అంజిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎస్.ఈ కార్యాలయం ముందు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్,
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పదివేల 10,117 మంది కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఉత్తర్వులు ఇచ్చిన అన్ని శాఖలు సంస్థలలో ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేస్తామన్న ముఖ్యమంత్రి విద్యుత్ సంస్థలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికుల ను పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయం అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం అందర్నీ రెగ్యులర్ చేయాలని, 2022 పి.ఆర్సి ప్రకారం అందరికీ కనీస వేతనం, బేసిక్ వేతనంగా చెల్లించి ఎరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలో డైరెక్టర్ పేమెంట్ చెల్లించి ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. నూతన షిఫ్ట్ ఆపరేటర్లకు ,వాచ్మెన్లుగా పనిచేస్తూ షిఫ్ట్ ఆపరేటర్లుగా నియమించబడిన వారికి పాత ఆపరేటర్స్ తో సమానంగా వేతనాలు చెల్లించాలన్నారు. మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం చెల్లించాలన్నారు. బిల్ కలెక్టర్ ఏజెంట్లకు ,ఎస్పీఎం కార్మికులకు విద్యుత్ స్టోర్ హామాలీలకు పీస్ రేటు రద్దుచేసి కనీస వేతనాలు చెల్లించాలన్నారు. ట్రాన్స్కో లో సి. బి. డి కార్మికులకు ప్రమాదాలు జరిగితే నష్టపరిహారం ,కోలుకునే దాకా ప్రత్యేక సెలవులు ఇచ్చి వైద్య సౌకర్యం కల్పించి, రిస్క్అలవెన్స్ ఇవ్వాలన్నారు. సిపిడిసిఎల్ లో ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని కోరారు. ఈఎస్ఐ పరిమితి దాటిన కాంట్రాక్టు కార్మికులకు మెడికల్ అలవెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పారు. కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. మహిళా ఉద్యోగులకు ఇతర శాఖలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా ఏడాదికి ఐదు ప్రత్యేక సెలవులు అమలు చేయాలన్నారు. కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ప్రతి సబ్ స్టేషన్కు గతంలోలా నైట్ వాచ్మెన్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంట్రాక్ట్ స్కిల్ కార్మికులకు నెలకు 43,162 రూపాయలు చెల్లిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన దానితో కలిపి కేవలము 27,953 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ 30,000 మంది కాంటాక్ట్ కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. ఈ కాలంలో కొత్తగా జాయిన్ అయినా షిఫ్ట్ ఆపరేటర్లు ఈ వేతనం కూడా ఇవ్వకుండా కేవలం 18,500 మాత్రమే చెల్లించి దోపిడీ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణలో లావేతనం చెల్లించి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో విద్యుత్ కార్మికులు కె. భీమేష్, ఈ .ప్రవీణ్ కుమార్, ఎం. జావిద్మియా దాదా, బి. మల్లికార్జున రెడ్డి,జె.యూనస్ భాష, జె. సంతోష్ ,బి నాగరాజు, బి. రాముడు ,ఎం. రామాంజనేయులు కూర్చున్నారు.

➡️