సిఎస్‌గా నీరబ్‌ పదవీకాలం పొడిగింపు

Jun 27,2024 20:20 #ap cm chandrababu, #ap cs

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. ఈ మేరకు డిపార్టుమెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డిఒపిటి) ఆదేశాలిచ్చింది. ప్రస్తుత సిఎస్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం ఈ నెల 30తో ముగుస్తుంది. దీంతో అతని పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీన్ని పరిశీలించిన కేంద్రం వెంటనే అనుమతినిచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 31వ తేదీ వరకూ నీరబ్‌కుమార్‌ ఆ పదవిలో కొనసాగనున్నారు.

➡️