పెద్దగూడలో నిమ్మక ప్రచారం

May 10,2024 20:27

 ప్రజాశక్తి – సీతంపేట :  మండలంలోని పెద్దగూడలో జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు వైసిపి నాయకులు సవర సతీష్‌, సవర చిన్నారావు, సవర కవిత, సవర రామారావు, సవర సరస్వతి, సవర సుభాని, సవర పార్వతి, సవర సింహాచలం జయకృష్ణ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈసందర్భంగా వారికి జయకృష్ణ జనసేన కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీతంపేట మండల టిడిపి అధ్యక్షులు సవరతోట మొఖలింగం, మండల జనసేన అధ్యక్షులు మండంగి విశ్వనాథం, మండల బిజెపి అధ్యక్షులు ఆరిక అమల, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.పాలకొండ : జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా పట్టణంలో నాలుగో వార్డులో కూటమి నేతలు శుక్రవారం ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ మ్యానిఫెస్టో కరపత్రాలను అందించారు. కార్యక్రమంలో నాలుగో వార్డ్‌ కౌన్సిలర్‌ గంగు నాయుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొరికాన రవి, టిడిపి నాయకులు తేజోవతి, గంటా సంతోష్‌ తదితరులు ఉన్నారు.

➡️