కష్టజీవుల పక్షాన పోరాటాం

ప్రజాశక్తి-బి.కొత్తకోట కష్టజీవుల పక్షాన నికరంగా పోరాటాలు చేస్తున్నామని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షతన గురువారం అన్నమయ్య జిల్లా హార్సిలీహిల్స్‌లో ప్రారం భమయ్యాయి. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య 1934లో స్థాపించిన వ్యవ సాయ కార్మిక సంఘం నేడు కోటి మంది సభ్యులతో దేశవ్యాపితంగా విస్తరించిందని పేర్కొన్నారు. దేశంలో నేటికీ 65 శాతంపైగా ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఆ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టే ఉద్దేశ్యంతో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, దానిపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం, గ్రామీణ ప్రజల జీవితాల మెరు గుదల కోసం వ్యవసాయ కార్మిక సంఘం అనేక ఉద్యమాలు, పోరాటలు చేస్తున్నదని గుర్తుచేశారు. రాబోయే కాలంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాల రూపకల్పనకు హార్సిలీహిల్స్‌లో రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగు తున్నాయని తెలిపారు. వ్యవసాయ కూలీలు సాధించుకున్న పథకాలు రక్షిం చుకోవాలని అందుకోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిం చాలని తెలిపారు. తగిన వర్షాలు లేక, అనావృష్టి వలన విపత్తు వచ్చినప్పుడు పేదలను ఆదుకున్నది ఉపాధి హామీ పథక మేనని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంక టేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజలను విస్మరించి మోసం చేస్తున్నాయని, మతోన్మాద బిజెపిని నెత్తిన ఎత్తుకొని ఊరేగుతున్నాయని విమ ర్శించారు. వచ్చే ఎన్నికల ఫలితాలలో ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేది లేదని పేదల కోసం, వ్యవసాయ కూలీల రక్షణ కోసం ఉద్యమాలు తప్పవని పేర్కొన్నారు. భూమి, ఉపాధి పరిరక్షణకై వ్యవసాయ కూలీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్తాయి పర్యటనలు చేయాలని, గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేసి పరిష్క రించుకో వాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులు విక్రమ్‌సింగ్‌, రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ పి.శ్రీనివాసులు, కె.రవి, కెవి. నారాయణ, ఆంజనేయులు, నాగే శ్వరరావు కోట కళ్యాణ్‌, పుల్లయ్య, సింహా చలం, ఓబుల రాజు పాల్గొన్నారు.

➡️