మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం

Jan 30,2024 16:02 #Gandhiji, #Kadapa, #vardanti

ప్రజాశక్తి-కమలాపురం(కడప) : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సర్‌ సివి రమన్‌ సైన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో గాంధీజీ జీవితంపై ఛాయ చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ.ఓబులరెడ్డి మాట్లాడుతూ.. శాంతి, అహింస, సత్యంతో మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శప్రాయుడని ఆయన జీవిత ఆశయాలను అందరూ కొనసాగించాలని తెలిపారు. ఆర్‌.శ్రీనివాసులరెడ్డి, జీవశాస్త్ర ఉపాధ్యాయులు, కడప డివిజన్‌ సైన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు తాను రూపొందించిన ఛాయాచిత్రాలను గాంధీజీ జీవిత సన్నివేశాలను విద్యార్థులందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేశ్వర ప్రసాద్‌, సునీల్‌, ఝాన్సీ రాణి, రాజశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️