50 వ డివిజన్ నుంచి పలువురు వైసీపీలో చేరిక

Mar 21,2024 16:31 #join ysrcp, #Vizianagaram

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చేసిన అభివృద్ధి, నాయకత్వానికి ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారని వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్ అన్నారు. గురువారం 50వ డివిజన్ తెలుగుదేశం, జనసేన పార్టీల కి చెందిన 25 కుటుంబాల వారు వైసిపి తీర్థాన్ని పుచ్చుకున్నారు. వారందరికీ పార్టీ కండువాలను వేసి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆశపు వేణు, ఎస్ వివి రాజేష్ మాట్లాడుతూ వైయస్సార్ నగర్ అభివృద్ధికి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కట్టుబడి ఉన్నారన్నారు. ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు మేర వివిధ అభివృద్ధి పనులను చేపట్టారన్నారు. కాలువల నిర్మాణాలను చేపట్టి చివరి దశకు చేర్చారన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలో విసిగి వేసారిన 25 కుటుంబాల వారు వైసిపి తీర్థం పుచ్చుకోవడం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో ప్రజలకు నమ్మకాన్ని ధైర్యాన్ని ఇచ్చిన కోలగట్ల వీరభద్ర స్వామి నాయకత్వాన్ని మెచ్చి తదనంతరం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 48 స్థానాలను ప్రజలు కట్టబెట్టారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కోలగట్ల గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. పలువురు వైసీపీలోకి రావడంతో పార్టీ కి మరింత బలం చేకూరినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జులు బొద్దాన అప్పారావు, మారం బాల బ్రహ్మారెడ్డి, వైసీపీ నాయకులు తోనంగి జగన్నాథ్ రెడ్డి, రఘురాం, గోపి, సలీం, కృష్ణ, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

➡️