గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు చెల్లించాలి

Dec 11,2023 20:48

 సీతానగరం : గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు చెల్లించాలని సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, గ్రీన్‌ అంబాసిడర్‌ యూనియన్‌ నాయకులు ఎం.గౌరి సోమవారం స్థానిక ఎంపిడిఒ ఎంవిఎస్‌ఎన్‌ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 నెలలు కావస్తున్నా సక్రమంగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. పంచాయతీల్లో అన్ని పనులు సర్పంచులు చేయించుకుంటున్నారని, పూడికతీతల తో పాటు ఏ ఒక్క పని అయినా చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వలె సర్పంచులకు కాకుండా నేరుగా తమ అకౌంట్లో జీతాలు చెల్లించాలని, పెండింగ్‌ జీతాలు ఇప్పించా ల్సిందిగా కోరారు. వినతిని అందజేసిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, గ్రీన్‌ అంబాసిడర్ల యూనియన్‌ సభ్యులు సిహెచ్‌ శివున్నాయుడు, తిరుపతిరావు, సింహాచలం, గ్రీన్‌ అంబాసిడర్లు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : మండలంలో వివిధ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు ఏడాది పొడవున బకాయి జీతాలు చెల్లించలేదని ఆ సంఘ మండల అధ్యక్షులు ఎం.పైడయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించాలని కోరుతూ స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఇఒపిఆర్డి జగదీష్‌ కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జీతాలను నేరుగా ఇవ్వాలని, మున్సిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా అలవెన్స్‌ జీతాలు పెంపు, గుర్తింపు కార్డులు ,గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, పదివేలు పెన్షన్‌ , యూనిఫారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె. గౌరీశ్వరరావు, పలువురు పారిశుధ్య కార్మికులు ఉన్నారు.

➡️