రేషన్ వాహనాలు.. రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానం చేయాలి

Jun 20,2024 18:59 #Nadendla Manohar

ప్రజాశక్తి ‌‌- వీరఘట్టం మండలం : పాలకొండ నియోజక వర్గం, పార్వతీపురం మన్యం జిల్లా. జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్ మత్స. పుండరీకం, క్రియాశీలక సభ్యుడు గోడబ మహేష్ లు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి , జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిశారు. అనంతరం మత్స. పుండరీకం మనహార్ గత ప్రభుత్వం ( రేషన్ వాహనం ) బియ్యం బండి ని కూటమి ప్రభుత్వం కొనసాగించి మొదట పదిహేను రోజులు రేషన్ పంపిణీ చేసి తరువాత పదిహేను రోజులు రైతు భరోసా కేంద్రకి అనుసంధానం చేసి రైతుల ఇంటికి ఎరువులు విత్తనాలు తీసుకువెళ్లే విధంగా ఉచిత రవాణా కోసం వినియోగించే విధంగా మార్పులు చేయాలని కోరారు. ఈ విధంగా చేయడం వలన రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయని సూచించారు. అదేవిధంగా రేషన్ పంపిణీ లో గత ప్రభుత్వం బియ్యం మాత్రమే ఇచ్చేది , నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం బియ్యం, కంది పప్పు, పంచదార, మంచి నూనె, చింతపండు, గోదుమలు, రాగిపిండి, బెల్లం, కోడిగుడ్లు ఇస్తే బాగుంటుందని. ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్ కి మత్స.పుండరీకం, గోడబ మహేశ్ లు వినతిపత్రం సమర్పించారు.

➡️