పివిటిజి గ్రామాలకు విద్యుత్‌ కల్పనకు సర్వే

Dec 20,2023 20:01

పార్వతీపురం : తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఇపిడిసిఎల్‌) సంచాలకులు (ఆపరేషన్‌) బి.రమేష్‌ బుధవారం కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను కలెక్టర్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పర్టిక్యులర్లి వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్‌ (పివిటిజి) గిరిజన ఆవాసాలకు విద్యుత్‌ కల్పనకు సర్వే నిర్వహిస్తున్నట్లు రమేష్‌ జిల్లా కలెక్టర్‌కు వివరించారు. విద్యుద్దీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందని, ఇంకా విద్యుదీకరణ లేకుండా గ్రామాలుంటే వాటికి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా పార్వతీపురంలో పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించా మని తెలిపారు. ఈ సందర్భంగా శాలువతో కలెక్టర్‌ను సత్కరిం చారు. కార్యక్రమంలో ఎస్‌ఇ ఎం లక్ష్మణరావు, ఇఇ డి.ఫణికిరణ్‌ కుమార్‌, డిఇ కె.వెంకట రత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️