రూట్‌ మ్యాప్‌ తయారు చేసుకోవాలి

Mar 23,2024 20:35

సీతంపేట : నియోజకవర్గంలోని పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలని పాలకొండ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి కల్పనా కుమారి అన్నారు. శనివారం సెక్టార్‌, రూట్‌ అధికారులతో సమావేశం నిర్వహిం చారు. పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల సామాగ్రి తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉండేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేయాలన్నారు. బస్సులు వెళ్లలేని పోలింగ్‌ కేంద్రాలకు బొలెరో, మ్యాక్సీ క్యాబ్‌ వాహనాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఓటింగ్‌ సమాచార నిమిత్తం సిగల్స్‌లేని పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలింగ్‌ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకోవడంలో సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమైందన్నారు. కార్యక్రమంలో స్థానిక తహశీల్దార్‌ మహేశ్వరరావు, ఆర్‌ఐ వెంకటేశ్వరరావు, సెక్టార్‌ రూట్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️