14నుంచి కలెక్టరేట్‌ వద్దఆశా కార్యకర్తలు వంటావార్పు

Dec 12,2023 22:09

పార్వతీపురం : సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈనెల 14,15 తేదీల్లో 36 గంటల పాటు కలెక్టరేట్‌ ముందు వంటా వార్పు నిర్వహిస్తూ నిరసన తెలియజేయనున్నట్టు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు శివాని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆశా కార్యకర్తలతో కలిసి మెడికల్‌ ఆఫీసర్‌ విద్యా మోహన్‌కు మంగళవారం వినతిని అందజేశారు. అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని, రిటైర్మెంట్‌ సౌకర్యం కల్పించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని, ఆశాల నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఎం.గౌరి, టి.పద్మావతి, పి.కొండ, జి.భాగ్యలక్ష్మి, ఎ.అరుణ, గంగా భాగ్యవతి, ఆర్‌ .దేవి, వై.దమయంతి, ఎం.పద్మ, వికె హేమలత, కె.జ్యోతి, లీలాశ్రీ, ఎస్‌.శాంతి, టి.కృష్ణవేణి, ఎ.శారద, వి.మాలతి, ఎం.గౌరీ, ఎం.సాయివల్లి పాల్గొన్నారు.సాలూరురూరల్‌ : ఈనెల 14 ,15 తేదీల్లో ఆశా వర్కర్ల కలెక్టర్‌ ఆఫీసుల వద్ద తలపెట్టిన వంటా వార్పును జయప్రదం చేయాలని ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మామిడిపల్లి, బాగువలస, తోణాం మెడికల్‌ ఆఫీసర్లకు వినతులు అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ మండల నాయకులు రాజేశ్వరి, త్రివేణి, ఆదిలక్ష్మి, భారతి పాల్గొన్నారు.పాచిపెంట : ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని తదితర డిమాండ్ల సాధనకు ఈనెల14, 15 రెండు రోజులపాటు కలెక్టరేట్‌ వద్ద ఆశా వర్కర్లు తలపెట్టిన వంటావార్పు కార్యక్రమానికి ప్రజలంతా సంఘీభావం తెలపాలని యూనియన్‌ నాయకులు కె.చండీప్రియ, మంజుల, నిర్మల, నాగవేణి కోరారు. ఈమేరకు సిఐటియు నాయకులు భవాని, కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో పాచిపెంట, గురువునాయుడుపేట పిహెచ్‌సిల వైద్యాధికారులు వెంకట్రావు, రవీంద్రబాబు వినతులు అందజేశారు.వీరఘట్టం: సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 14,15 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన ధర్నాకు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.ఉమామహేశ్వరికి ఆశా కార్యకర్తలు సమ్మె నోటీసు అందజేశారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. బలిజిపేట : ఈనెల 14 ,15 తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద జరగనున్న నిరవధిక ధర్నా చేపట్టనున్నట్టు ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. ఈ మేరకు బలిజిపేట, అరసాడ, గళావిల్లి వైద్యాధికారులకు వినతిపత్రాలు అందజేసింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు, ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు. జగదాంబ, కృష్ణవేణి, వీరమ్మ మాట్లాడారు. కురుపాం : సమస్యల పరిష్కారానికై కలెక్టరేట్‌ వద్ద జరుగు 36 గంటల నిరసన ధర్నాలో ఆశా వర్కర్లు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు వి.ఇందిర పిలుపునిచ్చారు. మండలంలోని మొండెంఖల్‌, నీలకంఠాపురం పిహెచ్‌సి వైద్యాధికారులకు ఆశాలతో కలిసి సమ్మె నోటీసులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం శ్రీనివాసరావు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

➡️