జనసేన అభ్యర్థిగా జయకృష్ణ నామినేషన్‌

Apr 24,2024 21:31

సీతంపేట: పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేసి రిటర్నింగ్‌ అధికారి శుభమ్‌ బాన్సల్‌కు అందజేశారు. తొలుత సీతంపేట సంత మార్కెట్‌ నుంచి ఐటిడిఎ వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు సవర తోట మొఖలింగం, నాయకులు గండి రామనాయుడు, గర్భాన సత్తిబాబు, కె.అప్పలనాయుడు, పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సవర చంటిబాబు ఆర్వో శుభమ్‌ బన్సాల్కు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ గిరిజనులకు అండగా ఇండియా కూటమి కాంగ్రెస్‌ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ అమలు చేయనున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బి.శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతిరావు, జి.సింహాచలం, సిపిఐ కార్యదర్శి కె.మన్మధరావు తదితరులు ఉన్నారుపార్వతీపురంరూరల్‌ : అరకు పార్లమెంటు, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వైసిపి అభ్యర్థులుగా తనుజారాణి, అలజంగి జోగారావు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. పాత బస్టాండ్‌ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన అనంతరం తమ నామినేషన్లను దాఖలు చేశారు.సాలూరు: టిడిపి అభ్యర్థి సంధ్యారాణి బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆర్‌ఒ విష్ణుచరణ్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. గురువారం ఆమె పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలుకాంగ్రెస్‌ అభ్యర్థిగా మువ్వల పుష్పారావు బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. డిసిసి అధ్యక్షులు నిమ్మక సింహాచలంతో కలిసి ఆయన నామినేషన్‌ పత్రాలను ఆర్వో విష్ణు చరణ్‌కు అందజేశారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్‌ నాయకులు సిగడాపు బంగారయ్య, ద్వారపు రెడ్డి పుండరీకాక్ష నాయుడు లేకుండా నామినేషన్‌ దాఖలు చేశారు.

➡️