బస్సు ఢకొీని ఒకరు మృతి

May 17,2024 21:06

జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం, సుభద్రమ్మవలస సమీపాన ప్రధాన రహదారిపై శుక్రవారం బైక్‌ను ఓ ప్రయివేటు బస్సు ఢకొీనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని బిజె పురం గ్రామానికి చెందిన డప్పు రాజు (30), మండంగి వెంకటరమణ కలిసి బైకుపై గవరంపేట పంచాయతీ వెంకటరాజపురం నుంచి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా సుభద్రమ్మవలస మలుపు వద్ద పార్వతీపురం నుంచి బత్తిలి వస్తున్న ప్రైవేట్‌ బస్సు ఢకొీంది. ఈ సంఘటనలో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటరమణకు ఎడమ కాలు, ఎడమ చేతికి తీవ్రగాయాలవ్వడంతో ఆయన్ను చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్‌ డ్రైవర్‌ చినమేరంగి పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఇ.చిన్నంనాయుడు ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతి రాజు పెయింటర్‌. తమకు చేదోడువాదోడుగా నిలిచే కుమారుడు అర్ధాంతరంగా మృత్యువాతాపడడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై రోధిస్తున్నారు.

➡️