ఆస్తి కోసం కుటుంబంపై మూకుమ్మడిగా దాడి

Apr 2,2024 15:05 #Tirupati district
  •  అమ్మా నాన్నలను కాపాడమని డైల్‌ 100 ఫోన్‌ చేస్తే స్పందించని పోలీసులు

ప్రజాశక్తి-తిరుపతి సిటీ : కురబలకోట మండలంలో ఆస్తి కాజేయడానికి ఓ రౌడి బ్యాచ్‌ రెచ్చి పోయింది. ఓ కుటుంబంపై అర్థ రాత్రి వేల మూకుమ్మడిగా దాడి చేసి హత్యా యత్నంకు పాల్పడింది. తీవ్ర కలకలం రేపిన ఘటనపై బాదితులు, జిల్లా ఆస్పత్రి ఔట్‌ పోస్టు పోలీసుల కథనం మేరకు వివరాలు.. కురబలకోట మండలంలోని నందిరెడ్డిపల్లె పంచాయతీ, ఎరజేనుపల్లికి చెందిన దంపతులు వై.అమరనాథ రెడ్డి, రెడ్డెమ్మలకు ఖరీదైన కొంత భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన స్థానికంగా వుండే ఓ రౌడీ బ్యాచ్‌ మొదట వారికి ప్రత్యర్థుల కుటుంబీకులను ఇద్దరిని అనుకూలంగా మార్చు కున్నారు. అప్పు డప్పుడు కొంత నగదు ముట్ట జెప్పి అగ్రిమెంట్లు రాసుకున్నారు. కారు చౌకగా కొంత ఆస్తిని కాజేశారు. ఇంకా మిగిలిన భూమిని కూడా రాసివ్వాలని.. కొన్ని రోజులుగా దంపతులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్థరాత్రి ఎరజేనుపల్లికి చేరుకొన్న ఆ బ్యాచ్‌ ఇంట్లో నిద్రిస్తున్న భూ యజమానులు వై.అమర్నాథ్‌ రెడ్డి, రెడ్డెమ్మలను ఆస్తి రాసివ్వాలని గొడవకు దిగింది. దంపతులను బయటకు లాక్కొచ్చి కాళ్ళతో తన్నుతూ, రాళ్లతో కొట్టారు. ఈ క్రమంలో బాధితుల పిల్లలు డైల్‌ 100కు ఫోన్‌ చేసిన పోలీసులు స్పందించలేదని తెలిపారు. దాడిలో గాయపడ్డ బాధితులను వారిపిల్లలే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.

➡️