ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు

మాట్లాడుతున్న పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌, పక్కన ట్ర్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, డిఆర్‌ఒ వినాయకం

 పల్నాడు : జిల్లాఎన్నికలకు సంబంధించి నిర్దేశిత నివేదికలు అన్ని సకాలంలో అందజేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్‌ లోతేటి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. శనివారం స్థానిక నరసరా వుపేట కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు నోడల్‌ అధికారులు, కలెక్టరేట్‌ సిబ్బంది కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది తదితరులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్ని కల అధికారి శివ శంకర్‌ మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాలని 14 వ తేదీ మధ్యాహ్నం వరకు సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు. సిబ్బంది అందరి దగ్గర నియోజకవర్గానికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచు కోవాలని, విధులు నిర్వహిస్తున్న ఆర్‌ ఓ పోలీసు సిబ్బందితో వారి వివరాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు.. వెబ్‌ కాస్టింగ్‌ కు సంబంధించి నియోజకవర్గానికి ఒకరు ఎన్నికల రోజున సాయంత్రం 7:00 గంటల వరకు నిఘా ఉంచాలని సూచిం చారు. మీడియా కంట్రోల్‌ రూమ్‌ నుండి ఎప్పటికప్పుడు టీవీలలో ప్రసారమవుతున్న ప్రతికూల వార్తలను స్క్రీన్‌ షాట్‌ తీసి సం బంధిత కంట్రోల్‌ రూమ్‌ కు అందించాల న్నారు. సమీక్షలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా రెవిన్యూ అధికారి వినాయకం పాల్గొన్నారు.

ఏమైనా సమస్యలు ఉంటే కాల్‌ చేయండి

మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు తమ పరిధిలోని పోలింగ్‌ స్టేషన్లనుపరిశీలిస్తూ సంబంధిత నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలు పొందుపరచాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు భూరేశ్వర నరేంద్ర, శ్రీహరి ప్రతాప్‌ షాహి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లి, గురజాల, మాచర్ల ,పెదకూరపాడు నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులుగా నియమితు లైన బూరె సర్వేశ్వర నరేంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో పోలింగ్‌ సమయంలో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే 91546 90367 నంబర్‌కు కాల్‌ చేసి వివరిం చాలని తెలిపారు. అదేవిధంగా నరసరావుపేట ,వినుకొండ, చిలకలూరి పేట నియోజకవర్గా లకు సాధారణ పరిశీలకులను నియమిత ులైన శ్రీహరి ప్రతాప్‌ షాహి మాట్లాడుతూ ఫామ్‌ -28 ను అందజేసి దానిపై అవ గాహన కల్పిం చాలన్నారు. పోలింగ్‌ సమ యంలో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే 91546 90375 కి కాల్‌ చేసి వివరించాలని సూచించారు.

మూడవ ర్యాండమైజేషన్‌ పూర్తి

ఎన్నికల సిబ్బందికి 3వ ర్యాండ మైజేషన్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులు భూరేశ్వర నరేంద్ర, శ్రీహరి ప్రతాప్‌ షాహీ, సమక్షంలో స్థానిక కలెక్టరేట్‌ లో నిర్వహించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల పిఒ, ఎపిఒ,ఒపిఒలు, సూక్ష్మ పరిశీలకులకు మూడవ ర్యాండమైజేషన్‌ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియను సమగ్రంగా నిర్వ హించి రీపోలింగ్‌ ప్రక్రియ లేకుండా చూడా లన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతి అధికారి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️