స్వగ్రామాలకు వలస ఓటర్లు

May 12,2024 21:16

ప్రజాశక్తి – విజయనగరం కోట : ఎన్నికల్లో వలస ఓటర్లు కీలకంగా మారనున్నారు. వీరి ఓట్లు కోసం అధికార, ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్ధులు ఇప్పటికే ఓటుకు నోటు ఇచ్చి, రాను పోను చార్జీలు కూడా ఇచ్చారు. సోమవారం ఎన్నిక కావడంతో ఆదివారం జిల్లాకు వలస ఓటర్లు క్యూ కట్టారు. దీంతో రైలు, బస్సులు కిటకిటలాడాయి. జిల్లాకు చెందిన వలస కూలీలు చాలా మంది విశాఖ, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు, కలకత్తా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరినీ ఆయా గ్రామాలకు చెందిన నాయకులు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తులో ఖర్చు పెట్టి తిరిగి గ్రామాలకు రప్పిస్తున్నారు. వీరంతా ఒకేసారి రావడంతో బస్సులు, రైలు చాలక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యవసాయ పనుల కోసం విజయనగరం నుంచి ఎక్కువ మంది వలస కూలీలుగా వెళ్లి అక్కడే ఉంటున్నారు. వారంతా తమ ఓటును వినియోగించుకోవడానికి తిరిగి రావడంతో బస్సులు కిక్కిరిసాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో వలసలు సుమారు 1.50లక్షలు మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరంతా ఆదివారం ఉదయం, సాయంత్రం రావడంతో బస్సులు చాలక ఇబ్బందులు పడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలాగైనా వినియోగించుకోవాలని కొంత మంది, తాయిలాలకు ఆశపడి కొంత మంది వలస ఓటర్లు స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. బస్సులు లేక అవస్థలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయనగరం ఆర్‌టిసి డిపో నుంచి బస్సులను ఎన్నికల నిర్వహణకు తరలించడంతో కాంప్లెక్స్‌ సరిపడా బస్సు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా వలస ఓటర్లు సుధీర ప్రాంతాల నుంచి రైలు ద్వారా వచ్చి విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ చేరుకునేసరికి బస్సు లేకపోవడంతో అసహనానికి గురయ్యారు. వచ్చిన ఒకటో రెండో బస్సులకు ప్రయాణికులు ఎక్కేందుకు పోటీపడుతూ కిందపడి గాయపడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికలకు 116 బస్సులుజిల్లా పరిధిలో రెండు డిపోలు ఉండగా విజయనగరం డిపోలో 126 ఆర్‌టిసి బస్సులకు గాను 84 బస్సులను ఎన్నికలకు తరలించారు. ఎస్‌ కోట డిపోలో 50 బస్సులకు గాను 32 బస్సులను తరలించారు. దీంతో సకాలంలో బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కేవలం 40 బస్సులను మాత్రమే విజయనగరం అందుబాటులో ఉంచడంతో అవస్థలు పడ్డారు. వలస ఓటర్లు ఎక్కువగా రావడంతో కాంప్లెక్స్‌ కిటకిటలాడింది. బస్సులు వస్తాయని చాలా మంది ప్రయాణికులు కొన్ని గంటలపాటు డిపోలకే పరిమితమయ్యారు. చిన్న పిల్లలతోనూ ముసలి వాళ్ళతో వారు తెచ్చుకున్న లగేజీలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి మరో మార్గం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. బొబ్బిలి: ఓటు వేసేందుకు వలస ఓటర్లు సొంత గ్రామాలకు తరలివచ్చారు. జీవనోపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలు వెళ్లిన వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగులు ఓటు వేసేందుకు తరలిరావడంతో రైల్వేస్టేషన్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కిటకిటలాడాయి. ఆర్‌టిసి బస్సులు అరకొరగా ఉండటంతో రైళ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. మూడు రోజుల నుంచి రైల్వే స్టేషన్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసిపి, టిడిపి అభ్యర్థులు వలస ఓటర్లపై గురి పెట్టడంతో వారంతా ఓటు వేసేందుకు స్వగ్రామాలకు చేరుకున్నారు.బస్సుల కోసం తప్పని తిప్పలుఎన్నికల విధులకు ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్‌టిసి బస్సులు అరకొరగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓట్లు వేసేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంత గ్రామాలకు వస్తున్నారు. వారంతా బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ఆర్‌టిసి బస్సులు లేకపోవడంతో ప్రయివేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఓటేసేందుకు వచ్చిన వలస గిరిజనులుశృంగవరపుకోట : మండలంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన గ్రామాల నుంచి పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన గిరిజనులు ఆదివారం స్వగ్రామాలకు చేరుకున్నారు. రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ప్రజాశక్తి – విజయనగరం కోటఎన్నికల్లో వలస ఓటర్లు కీలకంగా మారనున్నారు. వీరి ఓట్లు కోసం అధికార, ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్ధులు ఇప్పటికే ఓటుకు నోటు ఇచ్చి, రాను పోను చార్జీలు కూడా ఇచ్చారు. సోమవారం ఎన్నిక కావడంతో ఆదివారం జిల్లాకు వలస ఓటర్లు క్యూ కట్టారు. దీంతో రైలు, బస్సులు కిటకిటలాడాయి. జిల్లాకు చెందిన వలస కూలీలు చాలా మంది విశాఖ, విజయవాడ, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు, కలకత్తా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరందరినీ ఆయా గ్రామాలకు చెందిన నాయకులు ఓటు వేసేందుకు పెద్ద ఎత్తులో ఖర్చు పెట్టి తిరిగి గ్రామాలకు రప్పిస్తున్నారు. వీరంతా ఒకేసారి రావడంతో బస్సులు, రైలు చాలక ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వ్యవసాయ పనుల కోసం విజయనగరం నుంచి ఎక్కువ మంది వలస కూలీలుగా వెళ్లి అక్కడే ఉంటున్నారు. వారంతా తమ ఓటును వినియోగించుకోవడానికి తిరిగి రావడంతో బస్సులు కిక్కిరిసాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో వలసలు సుమారు 1.50లక్షలు మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరంతా ఆదివారం ఉదయం, సాయంత్రం రావడంతో బస్సులు చాలక ఇబ్బందులు పడ్డారు. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఎలాగైనా వినియోగించుకోవాలని కొంత మంది, తాయిలాలకు ఆశపడి కొంత మంది వలస ఓటర్లు స్వగ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. బస్సులు లేక అవస్థలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయనగరం ఆర్‌టిసి డిపో నుంచి బస్సులను ఎన్నికల నిర్వహణకు తరలించడంతో కాంప్లెక్స్‌ సరిపడా బస్సు లేక ఖాళీగా దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. ముఖ్యంగా వలస ఓటర్లు సుధీర ప్రాంతాల నుంచి రైలు ద్వారా వచ్చి విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ చేరుకునేసరికి బస్సు లేకపోవడంతో అసహనానికి గురయ్యారు. వచ్చిన ఒకటో రెండో బస్సులకు ప్రయాణికులు ఎక్కేందుకు పోటీపడుతూ కిందపడి గాయపడ్డారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికలకు 116 బస్సులుజిల్లా పరిధిలో రెండు డిపోలు ఉండగా విజయనగరం డిపోలో 126 ఆర్‌టిసి బస్సులకు గాను 84 బస్సులను ఎన్నికలకు తరలించారు. ఎస్‌ కోట డిపోలో 50 బస్సులకు గాను 32 బస్సులను తరలించారు. దీంతో సకాలంలో బస్సులు రాక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కేవలం 40 బస్సులను మాత్రమే విజయనగరం అందుబాటులో ఉంచడంతో అవస్థలు పడ్డారు. వలస ఓటర్లు ఎక్కువగా రావడంతో కాంప్లెక్స్‌ కిటకిటలాడింది. బస్సులు వస్తాయని చాలా మంది ప్రయాణికులు కొన్ని గంటలపాటు డిపోలకే పరిమితమయ్యారు. చిన్న పిల్లలతోనూ ముసలి వాళ్ళతో వారు తెచ్చుకున్న లగేజీలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి మరో మార్గం లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. బొబ్బిలి: ఓటు వేసేందుకు వలస ఓటర్లు సొంత గ్రామాలకు తరలివచ్చారు. జీవనోపాధి కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలు వెళ్లిన వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఉద్యోగులు ఓటు వేసేందుకు తరలిరావడంతో రైల్వేస్టేషన్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కిటకిటలాడాయి. ఆర్‌టిసి బస్సులు అరకొరగా ఉండటంతో రైళ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. మూడు రోజుల నుంచి రైల్వే స్టేషన్‌, ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసిపి, టిడిపి అభ్యర్థులు వలస ఓటర్లపై గురి పెట్టడంతో వారంతా ఓటు వేసేందుకు స్వగ్రామాలకు చేరుకున్నారు.బస్సుల కోసం తప్పని తిప్పలుఎన్నికల విధులకు ఆర్‌టిసి బస్సులను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్‌టిసి బస్సులు అరకొరగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓట్లు వేసేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న వారంతా సొంత గ్రామాలకు వస్తున్నారు. వారంతా బస్సులు లేక అవస్థలు పడుతున్నారు. ఆర్‌టిసి బస్సులు లేకపోవడంతో ప్రయివేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఓటేసేందుకు వచ్చిన వలస గిరిజనులుశృంగవరపుకోట : మండలంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన గ్రామాల నుంచి పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన గిరిజనులు ఆదివారం స్వగ్రామాలకు చేరుకున్నారు. రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఇటుకల బట్టిలో, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేందుకు వెళ్లిన గిరిజనులు మండలంలోని బొడ్డవర ప్రాంతానికి వచ్చి అక్కడ నుండి ఆటోలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. జీవనోపాధి కోసం ఎంత దూరం వెళ్లినా ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వారు చెబుతున్నారు. స్వగ్రామాలకు వలస ఓటర్లుఇటుకల బట్టిలో, వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేందుకు వెళ్లిన గిరిజనులు మండలంలోని బొడ్డవర ప్రాంతానికి వచ్చి అక్కడ నుండి ఆటోలో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. జీవనోపాధి కోసం ఎంత దూరం వెళ్లినా ఎన్నికల సమయంలో తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకుంటామని వారు చెబుతున్నారు.

➡️