కార్తీక పౌర్ణమికి అతిథిగా ఎమ్మెల్యే శంకర్ నారాయణ

Nov 27,2023 14:21 #Anantapuram District
mla attend karthika pounamy

ప్రజాశక్తి-రొద్దం : మండల కేంద్రంలోని కంబాలపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన భక్త కనకదాసు జయంతి వేడుకలకు పెనుగొండ ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో గురువు కురోత్సవ ఆరాధ్య దైవం అయిన భక్త కనకదాసు జయంతి సందర్భంగా జ్యోతులు, గ్రామంలో ప్రదర్శన చేపట్టి అనంతరం కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమంలో నిర్వహించారు. దీంతో ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా మండల కేంద్రంలోని సాని పల్లి గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగ ఈశ్వరుడి దేవాలయం నందు నిర్వహించిన మృత్యుంజయ హోమంలో పాల్గొని ఈశ్వరుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కంబాలపల్లి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మంజు, నాయకులు పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు యం.పి.పి.చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర స్టేట్ డైరెక్టర్ బి.నారాయణరెడ్డి, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, పరమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

➡️