చర్యలకు ఎందుకు వెనుకడుగు: ఎమ్మెల్యే

Jun 8,2024 20:36

ప్రజాశక్తి- బొబ్బిలి : గుర్రపు కోనేరు ఆక్రమణపై చర్యలకు పోలీసులు, దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ఎమ్మెల్యే బేబినాయన ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన గుర్రపు కోనేరును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన గుర్రపు కోనేరు మధ్యలో ఉన్న ఆలయ మండపంలో పురాతన విగ్రహాలు చోరీ చేసి కోనేరు ఆక్రమణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పురాతన విగ్రహాలు చోరీపై హిందూ ఉత్సవ సమితి సభ్యులు పోలీసులకు ఫిిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా కేసు రాజీ చేసేందుకు ప్రయత్నించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. విగ్రహాలు చోరిపై చర్యలు తీసుకోకుండా కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. గుర్రపు కోనేరు వద్ద పర్మినెంట్‌ నిర్మాణం చేపట్టినా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు స్పందించి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, పురాతన విగ్రహాలు చోరీపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.సాగు నీటికి మొదటి ప్రాధ్యాన్యత బొబ్బిలిరూరల్‌ : రైతులకు సాగు నీరు అందించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. శనివారం రొంపల్లి వద్ద ఉన్న పారాది చానల్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటి పారుదల శాఖ డిఇ తిరుపతి రావుని పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. గత పాలకులు ఐదు సంవత్సరాలుగా సాగునీటి పై నిర్లక్ష్యం వహించారని ప్రస్తుతం చానల్‌లో కుడి కాలువకు 2 కిలో మీటర్లు, ఎడమ కాలువకు 2 కోలో మీటర్లు చెప్పున పూడికలు తియ్యాల్సి ఉందని వాటిని తన సొంత నిధులతో చేయిస్తానని తెలిపారు. పనులకు రూ.32 కోట్లు వరకు ప్రతిపాదనలు తయారు చేశామని డిఇ తెలిపారు. అనంతరం భోజ్యరాజపురం పంపుహౌస్‌ను పరిశీలించి పట్టణ ప్రజలు తాగు నీటి సమస్యలు పరిష్కారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్‌ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పట్టణ తాగు నీటి శాశ్వత పరిష్కారానికి రూ.96 కోట్లుకు ప్రతిపాదనలు పంపామని కమిషనర్‌ తెలిపారు.ప్రజల కోసం పనిచేస్తాబాడంగి: రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గ ప్రజల కోసం పని చేస్తానని బొబ్బిలి ఎమ్మెల్య బేబీనాయన అన్నారు. శనివారం మండలంలోని కోడూరు రోడ్డులో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు నివాశానికి వచ్చిన ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల నివాళులర్పించారు. అనంతరం పిన్నవలస గ్రామస్తులు ఆయనకు స్వాగతం పలికారు. గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ కొల్లి రామినాయుడు ఆధ్వర్యంలో చీరలు పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన ఈ గెలుపును వృధా చేయకుండా ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. కొల్లి రామినాయుడు టిడిపి గెలుపులో భాగస్వామ్యం అయ్యారని బేబినాయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, వైస్‌ ఎంపిపి భాస్కరరావు, తెంటు కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️