6న మాక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

ప్రజాశక్తి-ఒంగోలు: వెబ్‌ కౌన్సెలింగ్‌కు హాజరు కానున్న ఇంజినీరింగ్‌, మెడికల్‌ స్టూడెంట్స్‌ కోసం బ్రిలియంట్‌ కంప్యూటర్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6న స్థానిక ఎ1 ఫంక్షన్‌ హాల్‌లో ప్రత్యేక మాక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నట్లు బ్రిలియంట్‌ సంస్థల అధినేత డాక్టర్‌ న్యామతుల్లా బాషా తెలిపారు. స్థానిక బ్రిలియంట్‌ సంస్థ ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. మాక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రోగ్రామ్‌కు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఏ తమీమ్‌ అన్సారియా, విశ్రాంత డిజిపి కిషోర్‌ కుమార్‌ హాజరు కానున్నట్లు తెలిపారు. దేశంలోనే పేరొందిన ఇంజినీరింగ్‌ కాలేజీలు, యూనివర్సిటీలు తమ విద్యా సంస్థల స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులకు అసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న ఇద్దరు విద్యార్థులకు లక్కీ డ్రా ద్వారా ఇద్దరికి ల్యాప్‌టాప్‌ అందజేయనున్నట్లు తెలిపారు. ల్యాప్‌టాప్‌ లక్కీ డిప్‌ కూపన్ల కోసం, ఉచిత బస్‌ పాస్‌ కోసం, ఎంట్రీ పాస్‌ కోసం ఒంగోలు అంజయ్య రోడ్‌లోని బ్రిలియంట్‌ సంస్థలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తహూర, కోర్స్‌ కో-ఆర్డినేటర్‌ కోటేశ్వరరావు, డైరెక్టర్‌ ఆకీల్‌, ఈవెంట్‌ మేనేజర్‌ నాగార్జున పాల్గొన్నారు.

➡️