ఎంపి, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం

Apr 3,2024 21:40

ప్రజాశక్తి-గజపతినగరం  : విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే బొత్సఅప్పలనర్సయ్య బుధవారం గజపతినగరం, పురిటిపెట పంచాయతీల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పేదలందరికీ పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు అందించిందని వివరించారు. గజపతినగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు మేలు జరగాలి అంటే మళ్లీ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో పురిటిపెంట మాజీసర్పంచ్‌ మండల సురేష్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, జెడ్‌పిటిసి సభ్యులు గారతవుడు, నాయకులు బెల్లాన త్రినాధరావు, యువ నాయకులు బొత్స సాయి గురునాయుడు తదితరులు ఉన్నారు.

➡️