బాబు మాయమాటలకు అమాయకులు బలి

Jan 8,2024 19:32

పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

– పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే గంగులచాగలమర్రి

బాబు మాయమాటలకు అమాయకులు బలి

 

ప్రజాశక్తి – చాగలమర్రి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాయమాటలకు అమాయకులు బలి అవుతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎంపీపీ వీరభద్రుడు అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి రావడానికి 600కు పైగా హామీలతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని విమర్శించారు. సిఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేజర్‌ గ్రామ పంచాయతి సర్పంచ్‌ తులసమ్మ,జడ్‌పీటీసి లక్ష్మిదేవి,వైస్‌ ఎంపిపి రఫి,మహిళా ఆర్థిక సాధికారిక సంస్థ డైరెక్టరు శ్రీవిద్య, జేసిఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ బాబూలాల్‌,మండల కన్వీనర్‌ కుమార్‌ రెడ్డి,జిల్లా సేవాదల్‌ అధ్యక్షుడు గణేష్‌రెడ్డి,ఎంపీటీసీ లు పత్తి నారాయణ, లక్ష్మిరెడ్డి, వెంకటలక్ష్మి, ఫయాజ్‌,సర్పంచ్‌లు బంగారు షరీఫ్‌, ప్రతాపరెడ్డి, మాలిభాష, శంకరమ్మ,గోవిందయ్య,దస్తగిరిరెడ్డి, ఎంపీడీవో మహబూబ్‌ దౌలా,తహసిల్దార్‌ సుభద్రమ్మ,వైసీపి నాయకులు వెంకటసుబ్బారెడ్డి, రామగుర్విరెడ్డి, శేషురమేష్‌, ఇబ్రహీం, రమణారెడ్డి,దస్తగిరిరెడ్డి,గేట్ల మాబు,అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

➡️